Metro Viral Video: మెట్రోలో ఇదేం పని.. అమ్మాయిలు మరీ ఇలా కూడా ఉంటారా? వీడియో చూస్తే మీరే అంటారు..

Young Girl Metro Viral Video: ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో యువతి చేసిన వింత పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 26, 2025, 04:59 PM IST
Metro Viral Video: మెట్రోలో ఇదేం పని.. అమ్మాయిలు మరీ ఇలా కూడా ఉంటారా? వీడియో చూస్తే మీరే అంటారు..

Young Girl Metro Viral Video: తరచుగా మెట్రోలో ప్రయాణిస్తున్న కొంతమంది వికృత చేష్టాలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. గతంలో కొంతమంది ప్రేమికులు నేరుగా మెట్రోలో రొమాన్స్ చేసుకున్న వీడియోలు ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి కొంతమంది ప్రేమికులు మెట్రో లిఫ్టులు రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు కూడా మనం గతంలో సోషల్ మీడియాలో చూసిన సంగతి తెలిసిందే. అలాగే కొంతమంది  సీటు కోసం కొట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో గతంలో వైరల్ అయ్యాయి. కానీ ఇటీవల వైరల్ అవుతున్న వీడియో అన్నింటికంటే చాలా భిన్నంగా ఉంది. ఇంతకీ ఈ వీడియో ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. 

Add Zee News as a Preferred Source

మెట్రోలో ప్రయాణించే చాలామంది అప్పుడప్పుడు వికృత చేష్టాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రీల్స్ పిచ్చోళ్లు డాన్స్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ యువతి చేసిన వింత పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ మెట్రో నిత్యం ఎంతగారద్ధి ఉంటుందో అందరికీ తెలిసిందే. చాలా చాలా రద్దీతో కూడిన ఈ మెట్రోలో ఓ యువతి వింత పని చేసింది. కూర్చోవడానికి సీటు లేకుంటే తను క్యారీ చేస్తున్న టబ్ కింద పెట్టి అందులో కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిని చూసినా అక్కడి స్థానికులు తెగబడి నవ్వుతున్నారు. అంతేకాకుండా తోటి ప్రయాణికులు పడి పడి మరీ చూస్తున్నారు. 

ఈ వీడియో @Rawat_1199 అనే ఖాతా నుంచి పోస్ట్ చేశారు.. దీనిని ఇప్పటివరకు ఎనిమిది లక్షలకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను షేర్ కూడా చేశారు. అయితే దీనిని చూసిన కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా కావాలని సోషల్ మీడియా హైప్ కోసం మెట్రోలో ఇతర ప్రయాణికులకు అవస్థలకు  గురిచేయడం మంచిది కాదని.. మెట్రో అధికారులు దయచేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఇది మంచి ఆలోచనని.. సీట్లు దొరకని వారు ఇలా చేయాలని కామెంట్లు రాసుకుంటూ వస్తున్నారు. ఈ వీడియోకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్ చేశారు. చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News