Young girls triple riding on roads in midnight video: సోషల్ మీడియాలో ఇటీవల ఫెమస్ అయ్యేందుకు యువతీ, యువకులు ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. బస్టాండ్ లు, మెట్రోలు, పబ్లిక్ ప్రదేశాలు అని కూడా చూసుకొకుండా రెచ్చిపోతున్నారు. కొంత మంది యువత పబ్లిక్ గా బైక్ లు, కార్లలతో తిరుగుతూ రొమాన్స్ లకు దిగుతున్నారు. మరికొంత మంది రాత్రిపూట అమ్మాయిలు బైట తిరగడం ఇప్పటికి కూడా అంత సేఫ్ కాదని భావిస్తారు.
కానీ మరికొందరు దీనికి భిన్నంగా అర్ధరాత్రి వరకు బైక్ ల మీద బాయ్ ఫ్రెండ్స్ తో రోడ్ల మీద తిరుగుతూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ముగ్గురు అమ్మాయిలు స్యూటీ మీద ట్రిబుల్ రైడింగ్ లకు దిగారు. అంతేకాకుండా వీళ్లు ముగ్గురు కూడా.. రాత్రి పూట రోడ్ల మీద మగాళ్లకు ఏంపని.. చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని తిరుగుతున్నారని రివర్స్ లో మండిపడ్డారు.
గాంధీ తాత కోరుకున్న స్వాతంత్ర్యం వచ్చేసింది pic.twitter.com/mV2F7A7vXF
— Michael Scofield (@Affiliated2Ts) June 1, 2025
అంతే కాకుండా.. రాత్రిళ్ల మీకు రోడ్ల మీద అసలు ఏంపని అని చెబుతూ రెచ్చిపోయారు. ముగ్గురు కూడా ఏమాత్రం తగ్గకుండా.. రన్నింగ్ స్కూటీ మీద రీల్స్ తీసుకుంటూ రెచ్చిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read more: Viral Video: అరె వావ్.. తల్లితో కలిసి గున్న ఏనుగు టబ్ స్నానం.. వైరల్గా మారిన ఫన్నీ వీడియో..
మరికొందరు మాత్రం.. రాత్రిళ్లు ఇలా త్రిబుల్ డ్రైవింగ్ చేయడం, వీడియోలు షూట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని సెటైర్ లు వేస్తున్నారు. మరికొంత మంది మాత్రం జాతీ పిత మహాత్మగాంధీ కోరుకున్న నిజమైన స్వాతంత్రం ఇదేనంటూ కూడా వీరికి సపోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









