)
Giant 12-foot King Cobra Viral Video: మనం తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో ప్రమాదకరమైన పాములకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఉంటాం.. అంతేకాకుండా కొంతమంది స్నేక్ క్యాచర్స్ వారు పట్టుకున్న పాములకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇలా పోస్ట్ చేసిన వీడియోలే అప్పుడప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా యువకుడు అత్యంత పెద్ద కింగ్ కోబ్రాని పట్టుకున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి సాధారణంగా మనం చిన్న చిన్న కింగ్ కోబ్రాలను మాత్రమే చూస్తూ ఉంటాం.. కానీ కొన్ని కొన్ని దేశాల్లో ఎంతో పొడవైన కింగ్ కోబ్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా అడవుల్లో ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు తప్పిపోయి.. ఆహారం కోసం జనావాసాల మధ్యకి వస్తూ ఉంటాయి..
తాజాగా ఇలాగే తప్పిపోయి వచ్చిన ఓ అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకుని అక్కడున్న స్థానికులకు చూపెట్టిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు అత్యంత ప్రమాదకరమైన పెద్దకి కింగ్ కోబ్రా కట్టుకొని ఉండడం కనిపించవచ్చు.. అంతేకాకుండా అతను పట్టుకున్న ఆ భారీ 12 అడుగుల కింగ్ కోబ్రా పాము కెమెరా వైపు చూడడం కూడా గమనించవచ్చు నిజానికి ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన పాములు కేవలం కొన్నిచోట్ల మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీటిని పట్టుకోవడం కూడా అంత సులభం కాదు..
అయితే, వీడియోలో ఆ కింగ్ కోబ్రా పాము ఎంతో భయానకంగా కనిపిస్తుంది. అంతేకాకుండా చూడడానికి ఆ పాము ఎంతో కోపంగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఆ పాము కెమెరా వైపు చూస్తూ దాని నోట్లో ఉన్న కోరలు ఒక్కసారిగా అటు ఇటు అంది.. ఆ పొడవైన కింగ్ కోబ్రాను పట్టుకున్న యువకుడు ఏమాత్రం భయపడకుండా ఉండడం చూసి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియో చూసిన చాలామంది ఇది పెంపుడుపామని అనుకుంటున్నారు.
ఇలాంటి ప్రమాదకరమైన పాములను పట్టుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు కూడా సూచిస్తున్నారు. ఈ వీడియో Ierlandirb అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షార్ట్ వీడియోగా పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 1,70,000 మందికి పైదా లైక్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోని చూసి చాలా మంది కామెంట్లు కూడా చేశారు. ఏది ఏమైనా ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలను పట్టుకునే సమయంలో చాలా ఆలోచించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి