King Cobra Video: అతి విషపూరితమైన కింగ్ కోబ్రాను పట్టుకున్న యువకుడు.. వీడియో చూశారా?

Venom King Cobra Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ కింగ్ కోబ్రాను పట్టుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఓ యువకుడు పెద్ద కింగ్ కోబ్రాను పట్టుకోవడం మీరు చూడవచ్చు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 3, 2025, 02:29 PM IST
King Cobra Video: అతి విషపూరితమైన కింగ్ కోబ్రాను పట్టుకున్న యువకుడు.. వీడియో చూశారా?

Venom King Cobra Viral Video Watch Now: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పొడవైన పాముల గురించి మీకు తెలుసా? అవేంటో కాదు కింగ్ కోబ్రా (Ophiophagus hannah) పాములే.. వీటిని పాములను తినే పాములుగా కూడా పిలుస్తారు. ఎందుకంటే కింగ్ కోబ్రా పాములు కేవలం పాములను మాత్రమే చంపుకొని తింటూ ఉంటాయని సమాచారం. అందుకే వీటిని  'ఓఫియోఫాగస్ హన్నా' అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. సాధారణంగా కింగ్ కోబ్రాలు 18 నుంచి 20 అడుగుల వరకు పొడవు పెరుగుతూ ఉంటాయి. ఇవి నలుపు రంగుతో పాటు గోధుమ రంగులను కలిగి ఉంటాయి. కొన్ని పాములు అయితే ఆలివ్ ఆకుపచ్చని రంగులో కూడా కనిపిస్తూ ఉంటాయని సమాచారం.. కొన్ని పాములకు వాటి శరీరంపై ప్రత్యేకమైన చారలతో కూడిన పట్టీలు కూడా ఉంటాయి.. ఇవి నాగుపాము ఉగ్రరూపం దాల్చినప్పుడు మరింత వెడల్పుగా మారుతూ ఉంటాయి.

Add Zee News as a Preferred Source

సాధారణంగా కింగ్ కోబ్రాలు చిత్తడి నేలలతో పాటు మడ అడవుల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అన్ని పాముల కంటే ఎక్కువగా నీటిలో ఈదుతూ ఉంటాయని సమాచారం. ఇవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్  తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే అడవుల్లో నీటి శాతం తగ్గి ఆహార కొడితే ఏర్పడడం కారణంగా ఇప్పుడు కింగ్ కోబ్రా పాములు ఊళ్ళలోకి సంచారం చేసి ఇళ్లలోకి దూరుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పాముకాటు బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అంటే అడవుల్లో నుంచి భారీ మొత్తంలో పాములు ఊళ్ళల్లోకి సంచారం చేస్తున్నాయని అర్థమవుతోంది. చాలామంది తెలిసి తెలియక వీటిని చంపేస్తున్నారు.  కొంతమంది అయితే స్నేక్  క్యాచర్స్ కి సమాచారం అందించి.. సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొంతమంది స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

చాలామంది స్నేక్ క్యాచర్స్ పాములు పట్టుకునే క్రమంలో వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా పాముకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి పొలం పనులకు వెళ్తుంటే అక్కడ అనుకోకుండా అతడికి కింగ్ కోబ్రా కనిపిస్తుంది. వెంటనే అతడు స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందిస్తాడు. పాములు పట్టే బృందం అక్కడికి చేరుకొని.. పామును వెతికేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలోనే పాము ఓ మట్టి పుట్టలోకి వెళ్లడం వారు గమనిస్తారు.

వెంటనే ఓ స్నేక్ క్యాచర్ ఆ పాము పట్టుకొని బయటికి లాగుతాడు. వెంటనే ఆ పాము బయటకు వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే, దీనిని ముందుగానే గ్రహించి ఆ స్నేక్ క్యాచర్ పాము దాడి నుంచి తప్పించుకుంటాడు. నెమ్మదిగా కొద్దిసేపు పాముని అటు ఇటు ఆడించి, ఆడించి ఓ ప్లాస్టిక్ డబ్బాలో దాన్ని బంధిస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోను రామ్ గోవింద్ రెస్క్యూ టీం అనే యూట్యూబ్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వందల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా కొంతమంది కామెంట్స్ కూడా చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News