)
Rare King Cobra Video Latest Watch: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. చాలా మందిని కొన్ని కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. దీంతో కొంతమంది చేసేదేమిలేక చిన్న చితక వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. మరికొంతమంది చిన్న చిన్న యూట్యుబ్ ఛానెల్స్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచే వీడియోలు ఆప్‌లోడ్ చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో హైప్ పొందడానికి సహసోపేతమైన చర్యలకు పాల్పడి.. వీడియోలు తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఓ యువకుడు పోస్ట్ చేసిన పాముకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది..
ఈ వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు వీడియో ప్రారంభంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముని పట్టుకుని పైకి లేపడం మీరు చూడొచ్చు. అలాగే ఆ పాము కూడా చాలా నిటారుగా నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. అయితే, అలా నాగుపాము నిటారుగా లేవడంతో కెమెరా కూడా దాని తలపైకి జూమ్ చేస్తూ రావడం చూడొచ్చు.. ఇప్పుడు ఈ పాము మరింత భయానకంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ దృశ్యాలు చూసే అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతటి ప్రమాదకరమైన పామును యువడు పట్టుకోవడం చూసి.. ఇది చాలా ప్రమదకరమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియోలోని పామును పట్టుకోవడంపై ఆ వ్యక్తి చూపించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఇలా పాములతో చాలా జాగ్రత్తగా వ్యహరించాల్సి ఉంటుంది.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు తెలుపుతున్నారు. ఆ వ్యక్తి పట్టుకున్న భారీ నాగుపాము దాదాపు 15 అడుగుల పొడవు ఉంటుంది. అంతేకాకుండా ఇది అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దాదాపు ఇది దాడి చేస్తే మనిషి తప్పకుండా మరణించే అవకాశాలు ఉన్నాయి.
ఈ వీడియోను @Akshay అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు సమాచారం.. అంతేకాకుండా దీనిని రెండు లక్షల మందికిపై లైక్ చేశారు. అలాగే చాలా మంది కామెంట్లు చేశారు. కొంతమంది ఈ వీడియోను చూసి..వన్ కిస్ లైఫ్ మిస్ అనే కామెంట్లు చేస్తే.. మరికొంతమంది, పాముల చాలా అద్భుతంగా.. అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇది చూసిన కొంతమంది నిపుణులు ఇలా పాములు పట్టుకోవడం చాలా ప్రమాదకరమని తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి