)
Huge 9-foot Python Video Watch Here: ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ కొండచిలువలు రోడ్లపై తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు జనాభాసాల్లో కూడా ఇవి సంచారం చేస్తాయి. ఆస్ట్రేలియా అడవి ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లో పాడి పశువులపై దాడి చేసి వాటిని ఆహారంగా మార్చుకొని తింటూ ఉంటాయి. ఇలా ఇప్పటివరకు ఎన్నో ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ ప్రాంతంలో ఏకంగా రోడ్డుపై హంగామా చేసిన పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ఓ అత్యంత ప్రమాదకరమైన పెద్ద కొండచిలువ దర్శనం ఇచ్చింది. దీంతో వాహనాలు స్తంభించిపోయాయి. అయితే ఇది గమనించిన బైక్‌పై వెళుతున్న యువకుడు వెంటనే తన బైకును రోడ్డుపై ఆపి.. ఆ కొండచిలువ దగ్గరికి దగ్గరికి వెళ్లాడు. అతను తన రెండు చేతులతో కొండచిలువను పట్టుకొని రోడ్డు దాటించాడు. దీంతో రోడ్డు పక్కనుంచి ఆ కొండచిలువ అడవి ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు మొబైల్ ఫోన్స్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తరచుగా ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో ఇలా రోడ్లపై కొండచిలువలు దర్శనం ఇవ్వడం సర్వసాధారణమైన అని స్థానికులు చెబుతున్నారు. అప్పుడప్పుడు కొండచిలువలు రోడ్డు దాటుతుండగా వాహనాలు ఢీకొని ప్రాణాలు కూడా కోల్పోతున్నాయని సమాచారం. అయితే మానవత్వం కలిగిన కొంతమంది మాత్రమే.. రోడ్డు దాటుతున్న 9 అడుగుల కొండచిలువలను పట్టుకొని ఇలా సురక్షితంగా అడవి ప్రాంతాల్లోకి వెళ్లేలా చేస్తున్నారని కొంతమంది అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆ యువకుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలా రోడ్డు దాటుతున్న కొండచిలువను రక్షించడం చాలా అరుదైన ఘటనగా భావించవచ్చు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను 'CourierMail' అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ ఖాతా నుంచి అనేక వీడియోలను సోషల్ మీడియాలో వదిలినట్లు సమాచారం. ఆస్ట్రేలియాలోని సన్‌షైన్ కోస్ట్‌లోని మాలెనీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆ యువకుడు చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికీ మానవత్వం బతికి ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి