Rare Giri Nagu Video: 12 అడుగుల గిరి నాగును ఒంటిచేతితో పట్టుకున్న యువకుడు.. వీడియో చూస్తే తప్పకుండా భయపడతారు..

Rare Giri Nagu Video: గిరి నాగు ఎంత ప్రమాదకరమైన పాము అందరికీ తెలిసిందే.. ఈ పాము ఒక్కసారి కాటేస్తే తప్పకుండా జంతువైనా మనిషైనా మరణించాల్సిందే. అయితే ఈ పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 16, 2025, 04:29 PM IST
Rare Giri Nagu Video: 12 అడుగుల గిరి నాగును ఒంటిచేతితో పట్టుకున్న యువకుడు.. వీడియో  చూస్తే తప్పకుండా భయపడతారు..

Rare Giri Nagu Video Watch: ఏదైనా చిన్న పాము చూస్తేనే అరిచి అర కిలోమీటర్ పరిగెత్తే వారు ఉంటారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో పాము ఏకంగా 12 అడుగుల పొడవు ఉంటుంది. జనావాసాల్లోకి తరలివచ్చిన భారీ కొండచిలువను రక్షించేందుకు కొంతమంది స్నేక్ క్యాచర్ అద్భుతమైన ఆపరేషన్ ప్రారంభించారు. ఈ మొత్తం ఆపరేషన్ కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా కింగ్ కోబ్రాలు ఒక చోటి నుంచి మరొక చోటికి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. కొన్ని అయితే ఆహారాలను వెతుక్కుంటూ వస్తాయి అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న కొండచిలువ కూడా అలాగే వచ్చినట్లుంది దీనిని రక్షించేందుకు కొంతమంది ప్రత్యేకమైన రక్షణ చర్యలు చేపట్టిన వీడియో క్లిప్పులు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. 

Add Zee News as a Preferred Source

అడవుల క్షీణిస్తున్న కొద్ది జంతువులతో పాటు పాములు జనావాసాల్లోకి సంచారం చేస్తున్నాయి. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లోని ప్రదేశాల్లో పాముల అయితే తరచుగా ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. కొంతమంది అయితే ఇళ్లలో పాములను సడన్గా చూసి భయపడి పరిగెడుతున్నారు కూడా.. నిజానికి పాములను ఎవరు చూసినా తప్పకుండా భయపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో చూసి చూడక పాముల పై అడుగులు వేసిన వారిపై దాడు కూడా చేస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది ఇలా ఇళ్లలోకి సంచారం చేసే పాములకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ కూడా చేస్తున్నారు. తాజాగా ఓ కొండచిలువకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. 

ఇక వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ ఇంటి పక్కనే ఉండే చెట్టుపై పెద్ద కింగ్ కోబ్రా కనిపిస్తుంది.. దీంతో అక్కడికి కొంతమంది స్థానికులు చేరుకొని పాములు పట్టే వారికి సమాచారం అందిస్తారు. దీంతో స్నేక్ క్యాచర్స్ బృందం అక్కడికి చేరుకొని, చెట్టుపై ఉన్న పామును పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఓ స్నేక్ క్యాచర్ తనకున్న అనుభవంతో ఎంతో చాకచక్యంగా ఆ పామును వెనుక నుంచి పట్టుకొని చెట్టు నుంచి కిందికి లాగుతాడు. పాము కూడా ఆయనపై ఏ మాత్రం దాడి చేయకుండా కిందికి వస్తుంది. ఇంతకుముందే వారు ఏర్పాటు చేసుకున్న సంచిలోకి ఆ పామును వెళ్లేలా చేస్తారు. ఆ పాము వెంటనే అందులోకి చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ గిరి నాగు పాముకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. 

ఈ వైరల్ అవుతున్న వీడియోను అగుంబే రెయిన్‌ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ (ARRS) ఫీల్డ్ డైరెక్టర్ అజయ్ గిరి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇలా పట్టుకున్న పామును అడవి శాఖ అధికారుల ఆధ్వర్యంలో ARRS బృందం సురక్షితమైన ప్రదేశంలో వదిలేశారని తెలిపారు. జనాభాసాల్లోకి ప్రవేశించి పాము లేవైనా వాటిని పట్టుకొని రక్షించడానికి వారి బృందం ఎప్పుడూ వెనకాడని అజయ్ గిరి తెలిపారు. ఇప్పటివరకు ఎన్నో రకాల అతి భయంకరమైన పాములను కూడా పట్టుకొని రక్షించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News