Venomous King Cobra Kissed Video Viral: పాములతో చాలామంది చెలగాటమడి వాటి కాటు బారినపడి గాయపడాల్సి వస్తోంది. అంతేకాకుండా కొన్ని చోట్లనైతే పాములను పట్టేవారు పాము కాటుకు గురై మరణించే పరిస్థితులు కూడా వస్తున్నాయి.. ఇవన్నీ తెలిసినప్పటికీ కొంతమంది కావాలని ప్రమాదకరమైన పాములతో సాహసం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావాలని ఎలాంటి నైపుణ్యం లేకుండానే పాములను పట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వాటి డాడికి గురవుతున్నారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను వైరల్ గా మారింది.
ఇటీవల ఓ యూట్యూబ్ కావాలని కంటెంట్ క్రియేట్ చేయడానికి పాములను వాడుకున్నాడు. పాములతో సాహసోపేతమైన చర్యలకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ వీడియోని చూస్తే పక్కా వెన్నులో చని పుట్టడం ఖాయం. ఏకంగా యువకుడు పాములను పట్టుకొని ముద్దు పెట్టేసుకున్నాడు. సాధారణంగా ఎవరు పాముల దగ్గరికి వెళ్లేందుకు అంతగా ఇష్టపడరు. కానీ ఈ యువ యూట్యూబ్ ఏకంగా పాముల దగ్గరికి వెళ్లి పామును ముద్దు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముగా చెప్పుకుంటారు. ఈ పాము విషంలో శక్తివంతమైన న్యూరోటాక్సిన్ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇది ఒక్కసారి కాటేస్తే తప్పకుండా మనిషి నాడీ వ్యవస్థ పై ప్రభావం పడి మరణం సంభవించే అవకాశాలు కూడా ఉంటాయని పరిశోధకులు చెబుతూ ఉంటారు. ఈ పాము ఒక్క కాటుతో ఏనుగును సైతం చంపేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాంటిది ఆ యువకుడు ఏకంగా కింగ్ కోబ్రా పాము దగ్గరికి వెళ్లి ముద్దు పెట్టేసుకున్నాడు. అంతేకాకుండా దానితో ఆడుకున్నాడు.
వీడియో వివరాల్లోకి వెళితే, ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న పాము దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి మరి ఆ పామును ఆపి కొద్దిసేపు అటు ఇటు చూసి.. నెమ్మదిగా పామును తన గ్రిప్‌లోకి తెచ్చుకొని ముద్దు పెట్టాడు. ఈ దృశ్యాలను తన పక్కనే ఉన్న ఇంకొకతను స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన వారంతా కామెంట్లలో ఆ యువకుడిని 'డేర్ డెవిల్' అని పిలుస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి రిస్క్ తీసుకున్నప్పుడు తప్పకుండా మన గురించి మనం ఆలోచించడం చాలా మంచిదని మరికొంతమంది చెబుతున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









