Snake Video: పాము తల పట్టి.. కుబుసాన్ని చేతులతో తొలచివేసిన యువకుడు.. వీడియో ఇదే..

Snake Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పాము కుబుసాన్ని స్నేక్ క్యాచర్ తొలచి వేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో అతను ఎంతో ప్రమాదకరమైన పామును పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 18, 2026, 04:54 PM IST
Snake Video: పాము తల పట్టి.. కుబుసాన్ని చేతులతో తొలచివేసిన యువకుడు.. వీడియో ఇదే..

Snake Latest Video: పెద్ద పెద్ద అడవుల్లో పాములు తమని తాము ఎలా రక్షించుకుంటాయనే ప్రశ్న ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటుంది. ఎంత పెద్ద పాములైన ప్రకృతిలో ఎంతో సులభంగా బ్రతకగలుగుతాయి. కానీ కొన్ని రోజులనుంచి పాములు అడవుల్లో ఆహార కోరతతో పాటు నీటి కొలత విపరీతంగా ఏర్పడడం వల్ల ఎక్కువగా జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి వస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే ఆ పాములు పడరాని పాటలు పడుతున్నాయి. తాజా ఓ పాము ఇలాగే అడవి నుంచి వచ్చి.. పంట పొలంలో నిల్వచేసి నీటి సంపులో పడింది. దీనిని గుర్తించిన ఆ పొలం యజమాని వెంటనే స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించారు. 

Add Zee News as a Preferred Source

ఆ రైతు సమాచారం అందించిన వెంటనే అక్కడికి.. స్నేక్ క్యాచర్ చేరుకున్నాడు. చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాడు. ముందుగా ఆ నీటి హంపిలో నీరు తీసేసి.. పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇదే సమయంలో పాము ఒడ్డుకు దగ్గరగా వచ్చింది. దీనిని గుర్తించిన అనేక క్యాచర్ వెంటనే నీటి సంపులోకి దిగి ఆ పాము తలను పట్టుకున్నాడు. ఆ భారీ పాము తలను పట్టుకున్న అతను వెంటనే అందులో నుంచి బయటికి తీసుకువచ్చాడు. అయితే ఈ క్రమంలో ఆ పాము తన కుబుసాన్ని వదిలిపెడుతున్నట్లు గుర్తించాడు. అలా పట్టుకున్న పాముని ఒడ్డు పైకి తీసుకువచ్చి.. పాము ఆపదలో ఉందని గమనించి.. ఆ పాముపై భాగంలో ఊడుతున్న చర్మాన్ని..నెమ్మదిగా తీసేందుకు ప్రయత్నించాడు.

Also Read: Viral News: ఇదెక్కడి విడ్డూరం... ఆ ఆలయానికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుందంట.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

ఈ వీడియోలో స్నేక్ క్యాచర్ మాట్లాడుతూ.. పాములు తమ కుబుసాన్ని ఎందుకు వదులుతాయని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పాములు తమ శరీర పెరుగుదల కోసం.. చర్మంపై పేరుకుపోయిన మురికిని, దానిపై ఉండే ఇతర జీవులను తొలగించడానికి ప్రతి ఏడాదికి రెండు మూడు సార్లు.. కుబుసం వదిలే ప్రక్రియను చేస్తాయని ఆయన తెలిపారు. అలాగే పాత చర్మం వదిలే సమయంలో పాము కళ్లు కూడా మసకబారినట్లు అనిపిస్తాయని.. దీనివల్ల అవి సరిగ్గా చూడలేవని అతని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాటి చూపు మరింత మందగిస్తుందని  అన్నారు.

అయితే, ఈ వీడియోలో అతను పట్టుకున్న పాము కుబుసం వదిలే ప్రక్రియలో ఉంది కాబట్టి స్నేక్ క్యాచర్‌ను ఏం అనలేకపోయింది. అంతేకాకుండా అతని దగ్గరకు వచ్చి మరి.. దాడి చేయలేకుండా ఉండిపోయింది. ఈ సమయంలో అతనికి ఉన్న మంచి మనసుతో ఆ పాము కంటి భాగంలో ఉండే చర్మాన్ని పూర్తిగా తన చేతులతోనే తీసేశాడు. ఈ సమయంలో అతను పాము తలభాగాన్ని గట్టిగా పట్టుకొని.. చాలా భాగంపై ఉండే కుబుసాన్ని నెమ్మదిగా తొలిచివేయడం మీరు చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే వైరల్‌గా మారాయి..

Also Read: Viral News: ఇదెక్కడి విడ్డూరం... ఆ ఆలయానికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుందంట.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News