)
Ibomma Logo Tattoo Viral Video: చిత్రపరిశ్రమకు లక్షల కోట్ల నష్టం కలిగించిన ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐ-బొమ్మ (iBomma), బప్పమ్ టీవీ ఆగడాలకు తెరపడింది. ఇటీవలే ఈ వెబ్‌సైట్‌ను రన్ చేస్తున్న ప్రధాన సూత్రధారి ఇమ్మిడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ అరెస్ట్ సమయంలో విచారనలో భాగంలో పోలీలు రవి నుంచి ఆశ్చర్యపరిచే విషయాలు తెలుసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీలో ఎన్నో రకాల సాంకేతిక ఆధారాలను సేకరించి ఇమ్మడి రవిని పట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అయితే, విచారణలో భాగంగా ఆతను పైరసీకి పాల్పడినట్లు, ఇతర బెట్టింగ్ వెబ్సైట్స్లతో ట్రాఫిక్ స్పెషల్ డొమైన్స్లను ఏర్పాటు చేసినట్లు రవి అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ ఐ బొమ్మ వెబ్‌సైట్‌ను వినియోగించుకుని ఇమ్మిడి రవి వందల కోట్లు అక్రమంగా సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వెబ్సైట్ ద్వారా వచ్చిన డబ్బులను క్రిప్టోకరెన్సీ వాలెట్ల నుంచి ICICI ఎన్ఆర్ఈ (NRE) ఖాతాకు వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా ఈ కేసులోకి వచ్చింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున అక్రమ సంపాదన, లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినట్లు ఈడీ గుర్తించింది. అలాగే రవి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై కూడా దృష్టి సారించింది. ఇదిలా ఉంటే జనాలు ఎక్కువగా పైరసీ వెబ్సైట్లో సినిమాలు చూడడానికి అలవాటు పడడంతో.. ఐ బొమ్మ రవి అరెస్ట్ అవ్వడం, పైరసీ వెబ్సైట్ ఆగిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అలాగే ఐ బొమ్మ రవి నిజమైన దేవుడు అంటూ సోషల్ మీడియాలో మిమర్స్ పోస్ట్‌ల వర్షం కురిపిస్తుంది. అయితే, చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఈ పోస్టల కింద పేదవారి దేవుడు ఐబొమ్మ రవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి తోడు కొంతమంది టీవీ ఛానెల్స్ వారు కూడా ఐ బొమ్మ రవిపై పాజిటివ్‌గా వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే సోషల్ మీడియాలో ఓ యువకుడు ఐ బొమ్మకు సంబంధించిన టాటూ వేసుకుంటున్న దృశ్యాలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఒక వ్యక్తి IBOMMA అన్ని తన బొడ్డు భాగంలో టాటూ వేయించుకోవడం చూడొచ్చు. ఇప్పుడు ఈ ఇన్‌ష్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook