)
Rare Viral Video Watch Here: సోషల్ మీడియాలో ఎన్నో వింతలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంది.. అందులో చాలా వరకు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఎక్కువగా ఫన్నీ జోక్స్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది తెలిసి తెలియక చేస్తున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లోయను ఓ మహిళ చేసిన సాహసోపేతమైన డాన్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్స్ ఇదేంట్రా బాబు ఇలా ఉందని ఆశ్చర్యపోతున్నారు.. ఇంతకీ వైరల్ అవుతున్న వీడియోలు ఏముంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జమ్ము కాశ్మీర్ లోని ఓ గ్రామానికి చెందిన భూషనాగ వంశీ అనే మహిళ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో ట్రెండింగ్ గా ఉంది. 2012 సంవత్సరం విడుదలైన హిందీ చిత్రం ఇషాక్జాదేలోని బాలీవుడ్ చార్ట్‌బస్టర్ 'మేరా ఆషిక్ చల్లా' పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యాన్ని చేస్తోంది. ఈ యువతి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఏకంగా కొన్ని అడుగుల ఎత్తు కలిగిన చెట్టుపై డ్యాన్స్ చేసింది. ఆమె ఏమాత్రం భయపడకుండా అలా డాన్స్ చేయడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొన్ని అడుగుల నిటారుగా ఉన్న చెట్లపై ఆమె డాన్స్ చేయడం చూసి చాలామంది వింత వింతగా కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను మూడు లక్షల మందికి పైగా వీక్షించగా 16000 మంది కంటే ఎక్కువే సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. అంతేకాకుండా 10 లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేశారు. నాగ వంశీ కేవలం సోషల్ మీడియాలో సేమ్ అవ్వడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇలా సాహసోపేతమైన డాన్స్ చేయడం అంత మంచిది కాదని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే "దీదీ అంటే మరణానికి భయం" అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే "నేల మీద కంటే ఇంటర్నెట్ నెట్వర్క్" అక్కడే బాగుంటుందని ఫన్నీ ఫన్నీ గా కామెంట్లను రాస్తున్నారు. ఇవే కాకుండా చాలామంది వారి అభిప్రాయాలను కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి