Bathroom Turns As House: నగరాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగడం.. విద్య కోసం వస్తున్న వారికి అద్దెలు గుదిబండగా మారుతున్నాయి. సింగిల్ రూమ్‌కే వేలల్లో అద్దెలు వసూలు చేస్తుండడంతో ఓ యువతి వినూత్నంగా ఆలోచించింది. వచ్చే జీతం అద్దెకే అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుండడంతో ఓ యువతి వేసిన ప్లాన్ అద్భుతంగా ఉంది. నెలకు రూ.9,415 ఇంటి అద్దెకు కాను ఆ యువతి కేవలం రూ.545 చెల్లిస్తోంది. ఆ కొద్ది మొత్తంలో చెల్లిస్తూ జీవిస్తున్న ఆ యువతి వార్త వైరల్‌గా మారింది. అయితే ఆమె స్టోరీ విన్నాక జాలి కలగడం ఖాయం. అంతటి కష్టాలు ఎదుర్కొన్న ఆమె స్టోరీ ఇదే.
Also Read: Telugu Hero: హీరోయిన్‌ను గర్భవతిని చేసి మోసానికి పాల్పడ్డ 'తెలుగు స్టార్ హీరో'
నగరాల్లో బతుకుతున్న ప్రజలకు ఇంటి అద్దెలు ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చే జీతంలో అధిక మొత్తంలో ఇంటి అద్దెకు వెళ్తున్నాయి. ఈ బాధ తప్పించుకునేందుకు ఓ చైనా యువతి ఆఫీస్ బాత్రూమ్‌నే నివాసంగా మార్చుకుంది. చైనాలోని హునాన్‌కు చెందిన ఓ యువతి (18) ఆమె ఒక ఫర్నిచర్ దుకాణంలో పని చేస్తుంది. అధికమొత్తంలో ఇంటి అద్దె భరించలేకపోయింది. నెలకు దాదాపు రూ. 31,800 జీతం వస్తుంది. అయితే అద్దె ఖర్చులు అధికంగా ఉండడంతో ఆమె తన వేతనంలో అధికంగా ఇంటి అద్దెకే వెళ్తున్నాయి. నెలకు రూ.9,415 ఇంటి అద్దె చెల్లించలేకపోతున్నది.
Also Read: Prevent Pregnancy: యువతకు గుడ్‌న్యూస్.. గర్భం రాకుండా శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
అద్దె తప్పించుకునేందుకు ఆమె తాను పని చేస్తున్న కంపెనీలోని రెస్ట్‌రూమ్ (బాత్రూమ్)ను తన నివాస స్థలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆఫీసులోని బాత్రూంలో నివసించడానికి తన యజమాని భార్యతో మాట్లాడింది. తన కష్టాలను చెప్పుకోగా యజమాని భార్య అంగీకరించడంతో కంపెనీ రెస్ట్ రూమ్‌ను తన నివాస స్థలంగా మార్చుకుంది. బాత్ రూమ్‌లో ఉంటుండంతో ఆ యువతి విద్యుత్, నీటి ఖర్చులకు అయ్యే ఖర్చు నెలకు రూ.545 చెల్లిస్తుంది.
ఎలా ఉంటుందంటే..?
బాత్రూమ్‌ను ఆ యువతి తనకు అనుకూలంగా మలచుకుంది. బాత్రూమ్ స్టాల్‌ను తాత్కాలిక గృహంగా మార్చేసింది. రహస్యంగా ఉండడం కోసం స్టాల్ తలుపులపై పెద్ద పెద్ద డోర్ కటన్‌లను వేలాడదీసింది. రాత్రి నిద్రపోవడానికి మడత మంచం ఏర్పాటు చేసుకుంది. అయితే ఇది ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడింది. బాత్రూమ్‌లో తన దుస్తులు ఉతకడం, భవనం పైకప్పుపై ఆరబెట్టడం చేస్తుంది. బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా నిద్రపోయే తానే శుభ్రం చేస్తుంది. అయితే ఆమె బాత్రూమ్‌లో నివసిస్తున్న విషయం బయటకు పొక్కింది. అయితే ఆ వార్త అక్కడ వైరల్‌గా మారింది. బాత్రూమ్‌లో నివసించడానికి గల దారితీసిన పరిస్థితులు ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఒక్క చైనాలోనే మన భారతదేశంలో.. హైదరాబాద్‌లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








