)
Kanipakam Brahmotsavam: వినాయక చవితికి దేశవ్యాప్తంగా భారీ ఏర్పాట్లు జరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లోనే స్వయంభూగా కొలువుదీరిన కాణిపాకం ఆలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపటి నుంచి జరగనున్న కాణిపాకం బ్రహ్మోత్సవాలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు ఎలాంటి లోటు లేకుండా.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కాణిపాకం బ్రహ్మోత్సవాల విశేషాలు ఇలా ఉన్నాయి.
స్వయంభూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. 21 రోజుల పాటు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలలో వినాయక చవితి రోజు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కాణిపాక ఆలయం ఈవో పెంచల కిషోర్ తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని వారికి ప్రత్యేక క్యూ లైన్లు ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు.
వినాయక చవితి రోజున నూతన అన్నదాన ప్రసాద భవనం ప్రారంభించనున్నారు. అన్నదాన భవనంలో ఒకేసారి 450 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించవచ్చు. స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు వచ్చిన అందరికీ దర్శన భాగ్యం కల్పించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని కాణిపాక ఆలయం ఈవో పెంచల కిషోర్ తెలిపారు. భక్తులకు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కూడా కల్పించారు. భక్తులకు ప్రత్యేకంగా టాయిలెట్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని కాణిపాక ఆలయం ఈవో పెంచల కిషోర్ తెలిపారు. 450 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామివారి వాహనసేవాలు ఊరేగింపు రథం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడికి సంతృప్తిగా స్వామి దర్శనం చేసుకునేలా చూస్తున్నట్లు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.