)
Lunar Eclipse Time Srikalahasti Temple Open: దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం సందర్భంగా అన్నీ ఆలయాలు మూసివేసి ఉంటాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతోపాటు అన్నీ ఆలయాలు మూసివేస్తుండగా ఒక్క శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరచి ఉంచుఉతున్నారు. గ్రహణం సమయంలో ఈ ఆలయంలో స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. అన్ని ఆలయాలకు లేని ప్రత్యేకత వాయులింగేశ్వర కాళహస్తి ఆలయానికి ఉంది. గ్రహణ సమయంలో స్వామి వారికి అభిషేకంతో పాటు భక్తులకు దర్శన భాగ్యం ఉండడం విశేషం. గ్రహణం సమయంలో తెరచి ఉండే ఏకైక ఆలయం శ్రీకాళహస్తి ఆలయం స్పెషల్ స్టోరీ.
సృష్టి, స్తుతి లయకారకుడైన పరమేశ్వరుడికి దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. దక్షిణ కైలాసంగా పిలిచే శ్రీకాళహస్తి క్షేత్రానికి చాలా ప్రత్యేకతలు.. విశిష్టతలు ఉన్నాయి. ఏపీలోని తిరుపతి జిల్లాలో తూర్పున ఉన్న స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీకాళహస్తి ఆలయం అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగేశ్వరుడు. ఈ ఆలయం అద్భుతమైన భారతీయ వాస్తు కళకు అద్దం పడుతుంది. శ్రీకృష్ణదేవరాయలు పాలనలో నిర్మించిన గాలిగోపురం చిక్కుచెదరని రూపంలో ఉంది.
గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం ఉన్న శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. ఆలయంలో ఉన్న అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగానికి ఎదురుగా అఖండ జ్యోతిగా వెలుగుందుతున్న ఉన్న నేతి దీపాలు మాత్రం ఎప్పుడు రెపరెపలాడుతుంటాయి. పరమేశ్వరుడి ఉచ్ఛ్వాసనిశ్చ్వాసం గాలి కారణంగా దీపం ఎప్పుడు రెపరెపలాడుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఇక్కడ అర్చకులు శివలింగాన్ని తాకకుండానే పచ్చ కర్పూరంతో అభిషేకం చేస్తుంటారు. శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే సర్పం, అస్తి అంటే ఏనుగు. ఈ మూడు జీవుల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. గ్రహణకాల సమయంలో కూడా ఆలయం తెరిచి పూజలు జరుగుతుంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.