Aloevera Vastu Tips: వాస్తుకు అల్లోవెరా మొక్కకు సంబంధమేంటి, ఏ దిశలో ఉంచాలి

Aloevera Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో వాస్తుకు అంత విశిష్టత ఉంది. అందుకే ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుండాలనే ప్రతి చిన్న విషయం గురించి వాస్తు వివరంగా చెబుతుంటుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 26, 2023, 09:48 AM IST
Aloevera Vastu Tips: వాస్తుకు అల్లోవెరా మొక్కకు సంబంధమేంటి, ఏ దిశలో ఉంచాలి

Aloevera Vastu Tips: చాలామంది ఇళ్లలో అల్లోవెరా మొక్కలు చూస్తుంటాం. అల్లోవెరా అనగానే గుర్తొచ్చేది ఆరోగ్య సంజీవని అని. కానీ అల్లోవెరా కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా వాస్తుపరంగా చాలా మహత్యం కలిగిందనేది వాస్తు పండితుల నమ్మకం. అల్లోవెరా మొక్క పెంచడం వల్ల ఊహించని ధనలాభాలుంటాయంటారు. ఆ వివరాలు మీ కోసం..

హిందూమతంలో వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం ఒక్కటే కాకుండా ఇంట్లో ఏ వస్తువులుండాలి, ఏవి ఉండకూడదు, ఏవి ఎక్కడ ఏ దిశలో అమర్చుకోవాలి, లేకపోతే ఏమౌతుంది అనే వివరాలు స్పష్టంగా ఉన్నాయి. అదే సమయంలో ఏ మొక్కలు ఏ దిశలో ఉండాలి, ఎలాంటి మొక్కలు పెంచుకోవాలనే సూచనలున్నాయి. చాలామంది అల్లోవెరా అంటే ఆరోగ్యపరమైందిగా భావిస్తారు. కానీ వాస్తు ప్రకారం అల్లోవెరాకు మహత్యముంది. అల్లోవెరా మొక్కను ఇంట్లో పెంచడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అయితే ఏ దిశలో అమర్చుకోవాలనేది చాలా ముఖ్యం.

జీవితంలో పైకి ఎదిగేందుకు, అన్ని రంగాల్లో విజయం సాధించేందుకు శ్రమతో పాటు అదృష్టం కూడా తోడుగా ఉండాలి. అదృష్టంగా తోడుగా లేకుంటే ఒక్కోసారి ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. ఈ పరిస్థితి చాలా మందికి ఎదురౌతుంటుంది. ఈ తరహ వ్యక్తులకు వాస్తు ప్రకారం కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. అలాంటిదే ఇంట్లో అల్లోవెరా మొక్కను పెంచడం. అల్లోవెరాలో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉండటమే కాకుండా మీరు ఊహించని విధంగా ధనలాభం కల్గిస్తుంది. అయితే ఓ ప్రత్యేకమైన దిశలో అమర్చాలంటారు. అల్లోవెరాను ఇంట్లో ఏ దిశలో ఉంచాలనేది చాలామందికి నిజంగా తెలియని విషయం. 

ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతుంటే అల్లోవెరా మొక్క అద్భుతమైన పరిష్కారం కాగలదు. దీనికోసం ప్రత్యేకమైన దిశ అంటూ నిర్ధారించలేదు. ఇంటి వాకిట్లో, బాల్కనీ లేదా తోటలో ఎక్కడైనా ఈ మొక్కను పెంచవచ్చు. అల్లోవెరా మొక్క పెంచడం వల్ల డబ్బులు వచ్చి పడటమే కాకుండా ఆ ఇంట్లో ఏవైనా నెగెటివ్ శక్తులుంటే దూరమౌతాయి.

మరోవైపు ఇంట్లో ఏదైనా విబేధాలు ఉంటే అల్లోవెరా మొక్కతో ఆ విబేధాలు లేదా కలహాలను దూరం చేయవచ్చంటున్నారు వాస్తు పండితులు.  వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలో అల్లోవెరా మొక్కను అమర్చడం వల్ల ఇంటి పరిస్థితిలో క్రమక్రమంగా మార్పు సంభవిస్తుంది. దాంపత్య జీవితం మెరుగుపడుతుంది. దాంతోపాటు కెరీర్‌పరంగా అభివృద్ధి సాధ్యమౌతుంది.

అల్లోవెరా మొక్కతో వాస్తుపరంగా పూర్తి ప్రయోజనాలు పొందాలంటే సరైన దిశ అనేది చాలా అవసరం. వాస్తు ప్రకారం అల్లోవెరా మొక్కను ఉత్తర దిశలో పొరపాటున కూడా ఉంచకూడదు. ఆల్లోవెరా మొక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దిశలో ఉంచకూడదు. దీనివల్ల ప్రతికూల ప్రభావం చాలా ఉంటుంది. 

వాస్తుశాస్త్రం ప్రకారం పలు అనారోగ్య సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు కూడా అల్లోవెరా మొక్క సరైన ప్రత్యామ్నాయం. ఇంట్లో పశ్చిమ దిశలో అల్లోవెరా మొక్కను అమర్చడం వల్ల ఆ ఇంట్లో దీర్ఘకాలిక వ్యాధులు లేదా మానసిక ఒత్తిడి  సమస్య దూరమౌతాయి. దీనివల్ల జీవితంలో అభివృద్ధి మార్గాలు తెర్చుకుంటాయి. వ్యక్తి జీవితంలో ఆనందం ఉంటుంది. 

Also read: Rahu Ketu Transit 2023: రాహు కేతువులు మరో 4 రోజుల్లో 3 రాశుల జీవితాల్ని మార్చేయనున్నాయి, మీ రాశి ఉందా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News