)
Ants Facts In Vastu Shastra: మనం తరచుగా ఇండ్లలో చీమల గుంపులను చూస్తూ ఉంటాం. ఇందులో చాలా చీమలు ఎరుపు రంగులో నలుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో ఉండే చిన్న చిన్న ఆహార పదార్థాలను చీమల గుంపు వాటి నివాసాల్లోకి తీసుకెళ్లడం మీరు తరచుగా గమనిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని చీమలు అయితే ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసా.? వాస్తు శాస్త్ర నిపుణులు దీనిపై ఏమంటున్నారు..? ఇంట్లో చీమలు తిరగడం శుభమా? అశుభమా? వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం..
ఎరుపు నలుపు రంగు చీమలు వేటిని సూచిస్తాయి?:
వాస్తు శాస్త్రం ప్రకారం నలుపు రంగు చీమలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు.. అందుకే చాలామంది నలుపు రంగు చీమలకు బెల్లంతో పాటు చక్కెరను ఆహారంగా వేస్తూ ఉంటారు. కొంతమంది అయితే నలుపు రంగు చీమలను ఇంట్లోనే పెంచుకుంటారు. అయితే అకస్మాత్తుగా నలుపు రంగు చీమలు ఇంట్లోకి ప్రవేశిస్తే.. అది మీ సంపదను సూచిస్తుందని వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. ఇలా చీమలు ఒకచోట ఇంట్లో గుంపుగా ఉండడం వల్ల సంపద కూడా విపరీతంగా పెరుగుతుందట. అలాగే ఎరుపు రంగు చీమలు కనిపిస్తే అది దూరదృష్టాన్ని సూచిస్తుందని శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది సంపద నష్టానికి కూడా దారితీస్తుందని సమాచారం.
ఇలా జరిగితే ధనవంతులవుతారు:
బియ్యం పెట్టనుంచి చీమలు రావడానికి కూడా శుభ సూచికంగా భావిస్తారని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. బియ్యం భద్రపరచుకున్న పెట్టెలో నుంచి చీమలు వస్తే అది త్వరలోనే ఊహించని డబ్బు వస్తుందని సూచిక గా భావిస్తారట. అంతేకాకుండా బంగారు ఆభరణాలు ఉన్నచోట కూడా చీమలు గుంపుగా ఉండటం వల్ల శుభ సూచికంగా భావిస్తారని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఇలా తరచుగా జరిగితే ఎక్కడి నుంచైనా ఊహించని డబ్బుతో పాటు బంగారాన్ని పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
ఈ దిశల్లో చీమలు ఉండడం మంచిది:
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని దిశల్లో చీమలు గుంపుగా ఉండడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరం నుంచి చీమల ప్రవాహం ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్తే.. అది ఆనందాన్ని సూచిస్తుందని వాస్తు శాస్త్రంలో తెలిపారు. ఇది త్వరలోనే మనకు ఆనందాన్ని తెచ్చి పెడుతుందని భావిస్తారు. అలాగే దక్షిణం నుంచి చీమలదండు వస్తే.. ఊహించని ఆర్థిక లాభాలు కూడా పొందుతారట. తూర్పు నుంచి నల్ల చీమలు వేరే చోటికి ప్రయాణిస్తే త్వరలోనే శుభవార్తలు వింటారని, పశ్చిమ దిశలో చీమలు ఇతర చోటికి వెళ్తే విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.
ఎర్ర చీమలు, నల్ల చీమలు:
శాస్త్రంలో తెలిపిన వివరాల ప్రకారం ఎర్ర చీమలను చెడు శకునాలకు సూచికగా భావిస్తారట. కాబట్టి ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే.. వాటిని వెంటనే తొలగించడం చాలా మంచిదని వాస్తు శాస్త్రంలో తెలిపారు. ఎర్ర చీమలు గుడ్లు పెట్టడం కూడా మంచిది కాదని పేర్కొన్నారు. ఇక నల్ల చీమలు అయితే ఇవి ఏదైనా శుభ శకునానికి సూచికగా భావిస్తారు. ఇంట్లో నల్ల చీమలు ఉండడం వల్ల ఊహించని స్థాయిలో లాభాలు పొందగలుగుతారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook