TTD WhatsApp Services: ఇకపై తిరుమల శ్రీవారి సేవలు కూడా వాట్సప్ ద్వారా, ఏయే సేవలంటే

TTD WhatsApp Services: తిరుమల తిరుపతి దేవస్థానం సేవల విషయంలో కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఇకపై కొన్ని రకాల సేవలు వాట్సప్ ద్వారా అందుబాటులో రానున్నాయి. వాట్సప్ ద్వారా ఏయే సేవలు అందుబాటులో ఉంటాయి, ఎలా పొందవచ్చనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 8, 2025, 10:10 AM IST
TTD WhatsApp Services: ఇకపై తిరుమల శ్రీవారి సేవలు కూడా వాట్సప్ ద్వారా, ఏయే సేవలంటే

TTD WhatsApp Services: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా వాట్సప్ సేవల్ని అందుబాటులో తీసుకొచ్చింది. దాదాపు 2 వందలకు పైగా సేవల్ని వాట్సప్ ద్వారా ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. తాజాగా పదో తరగతి, ఇంటర్ ఫలితాలను కూడా వాట్సప్ ద్వారా విడుదల చేస్తోంది. ఇప్పుడు టీటీడీ సేవల్ని అందుబాటులో తీసుకొచ్చింది. 

Add Zee News as a Preferred Source

ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సప్ పరిపాలన, సేవల గురించి తెలిసిందే. దాదాపు 200 కు పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కం సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ వంటివి చాలా ఉన్నాయి. దీనికోసం ఓ నెంబర్ కేటాయించింది. వాట్సప్ సేవలు పొందాలనుకునేవాళ్లు 9552300009 నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేస్తే చాలు తరువాత ప్రక్రియ సులభంగా అర్ధమౌతుంది. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ ఫలితాలను వాట్సప్ ద్వారా విడుదల చేస్తోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని కూడా వాట్సప్ ద్వారా అందించేందుకు నిర్ణయించింది. టీటీడీకు సంబంధించిన టీటీడీ సేవలు, సర్వ దర్శనం లైవ్ స్టేటస్ వివరాలను వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు.

టీటీడీ సేవల్ని వాట్సప్ ద్వారా పొందేందుకు ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేయాలి. ఆ తరువాత సేవల్లో టీటీడీ దేవాలయాల సేవలు ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత స్లాట్ దర్శనం లైవ్ స్టేటస్, సర్వదర్శనం లైవ్ స్టేటస్, శ్రీవాణి ట్రస్ట్ లైవ్ స్టేటస్, అడ్వాన్స్ డిపాజిట్ రిఫండ్ స్టేటస్ ఆప్షన్లలో మనకు కావల్సింది ఎంచుకుంటే తెలిసిపోతుంది. ప్రస్తుతం టీటీడీ సేవలు ట్రయల్ రన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. వాట్సప్ ద్వారా టీటీడీ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

త్వరలో మరిన్ని టీటీడీ సేవలు, విరాళాల వివరాలు అందుబాటులో తీసుకురానుంది. భక్తులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించే క్రమంలో తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏప్రిల్ 6న 72,960 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 23,126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 3.63 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు లేనివారికి దర్శనానికి 7-8 గంటల సమయం పడుతుంది. 

ఇటీవల ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు 20 లక్షలు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు 20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు 20 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్కు 10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా అందించింది. బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు 10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు విరాళం అందించారు. 

Also read: Amaravati Railway Station: దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అమరావతి, సిద్ధమైన గ్రాఫిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News