)
Ashadha Masam Festivals: హిందూ క్యాలెండర్లో ఆషాఢ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే ఈ మాసం ఎన్నో పర్వదినాలను మోసుకొచ్చేసింది. ఈ మాసంలో ప్రతి ఒక్కరోజు పండుగే. ఎన్నో పర్విదినాలు ఆషాఢ మాసంలో ఉన్నాయి. పరమేశ్వరుడు, మహా విష్ణువు, లక్ష్మీదేవితోపాటు పూరీ రథయాత్ర, తెలంగాణలో బోనాల పండుగ ఇలా అతి ముఖ్యమైన పండుగలు ఆషాఢ మాసంలో వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆషాఢ మాసం జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఉదయ తిథి ప్రకారం ఆషాఢ మాసం జూన్ 12 నుంచి ప్రారంభమై జూలై 10వ తేదీన ముగియనుంది. ఈ ఆషాఢ మాసంలో శివుడు, శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి, సూర్యుడు, పూరీ జగన్నాథుడు, షిర్డీ సాయిబాబా, బోనాల సందర్భంగా గ్రామీణ దేవతలను పూజిస్తుంటారు. హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో శ్రీ మహా విష్ణువు విశ్రాంతి తీసుకుంటారని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ మాసంలో శుభకార్యాలు చేయరు. ఈ నెలలో దక్షిణాయనం ప్రారంభమౌతుంది. ఆషాఢ మాసంలో విష్ణుభక్తులు చాతుర్మాస వ్రతాన్ని చేస్తారు.
గ్రహాల సంచారం ఇలా
గ్రహాల సంచారానికి అనుగుణంగా చూస్తే ఆషాఢ మాసం మరింత ప్రాముఖ్యం ఉంటుంది. ఆషాఢ మాసంలో గ్రహాల సంచారం సూర్యుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తారు. దీని ప్రభావం ఆయా రాశుల వారిపై ఉంటుంది.
పండుగలు
ఆషాఢ మాసంలో అనేక పండుగలు ఉన్నాయి. ప్రతిష్టాత్మక జగన్నాథ రథయాత్ర ఈ నెలలో జూన్ 27వ తేదీన జరుగుతుంది. ఒడిస్సాలోని పూరీలో దాదాపు నెల రోజుల పాటు ఈ ఉత్సవాల సందడి ఉంటుంది. పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలోనే పట్నాతోపాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహిస్తారు.
ముఖ్యమైన పర్వదినాలు
జూన్ 14 - సంకష్ట గణేష్ చతుర్థి
జూన్ 15 మిథున సంక్రాంతి
జూన్ 21బయోగిని ఏకాదశి
జూన్ 23 - ప్రదోష వ్రతం, మాస శివరాత్రి
జూన్ 24 - రోహిణి వ్రతం
జూన్ 25 - అమావాస్య, ఆషాఢ అమావాస్య
జూన్ 26 - గుప్త నవరాత్రి ప్రారంభం, చంద్ర దర్శనం
జూన్ 27 - జగన్నాథ రథయాత్ర
జూలై 06 - ఆషాఢ ఏకాదశి, దేవశయని ఏకాదశి
జూలై 08 - భౌమ ప్రదోష వ్రతం, జయ పార్వతి వ్రతం ప్రారంభం
జూలై 10 - పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పూజ, సత్య వ్రతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook