Astrology: 30 ఏళ్ల తర్వాత ఓ అరుదైన యాదృచ్చిక సంఘటన.. ఈ రాశులవారికి జరిగేది ఇదే!

Rare Coincidence After 30 Years: 30 ఏళ్ల తర్వాత ఓ అరుదైన యాదృచ్చిక సంఘటన ఏర్పడబోతోంది. దీనికి కొన్ని రాశులవారికి ప్రతికూల మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 22, 2025, 02:06 PM IST
Astrology: 30 ఏళ్ల తర్వాత ఓ అరుదైన యాదృచ్చిక సంఘటన.. ఈ రాశులవారికి జరిగేది ఇదే!

Rare Coincidence After 30 Years: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ ఏడాది మార్చి నెలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత మార్చి 29న ఒకే రాశిలో నాలుగు గ్రహాల కలయిక జరుగుతుంది. ఇది యాదృచ్చిక సంఘటన కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ఎఫెక్ట్‌ చూపుతుంది. ముఖ్యంగా మార్చి 29న శని మీన రాశిలోకి వెళ్తాడు.. ఆ తర్వాత మరికొన్ని గ్రహాలు కూడా సంచారం చేయబోతున్నాయి. అలాగే ఈ రోజే 2025 ఏడాది మొదటి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశులవారిపై అనుకూల, ప్రతికూల ప్రభావం పడుతుంది.  30 ఏళ్ల తర్వాత ఏర్పడబోతున్న యాదృచ్చికం వల్ల కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

మీన రాశి:
మీన రాశివారికి 30 సంవత్సరాల తర్వాత రాబోతున్న యాదృచ్చికం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సంబంధింత విషయాల్లో కోర్టు కేసులు, వాదనలు కూడా రావచ్చు. అలాగే వివాదాలు, అవమానాలు భరించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు రుణ సమస్యలు కూడా వస్తాయి. ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండడం మేలు. అలాగే ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వాహించాల్సి ఉంటుంది.

సింహ రాశి:
సింహ రాశివారికి ఈ సమయంలో అనేక ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం మేలు. రుణ సమస్యలు కూడా తలెత్తే ఛాన్స్‌లు ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్‌ లేక ఇతర జాబ్స్‌లో చేరుతారు. వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా కూడా నష్టాలను ఎదుర్కొంటారు. అప్పుల సమస్యలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం అనేక సమస్యలు వస్తాయి. 

మేష రాశి:
మేష రాశివారికి ఈ సమయంలో అనేక ఆర్థిక ఇబ్బందులు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో అనేక వివాదాలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్తాల్సి ఉంటుంది. కెరీర్‌ పరంగా కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. భూములు కొనుగోలు చేసేవారు కూడా కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ప్రయాణాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండడం ఎంతో మేలని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి కూడా ఈ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా శత్రువుల పట్ల కొన్ని నిర్ణయాలు తీసుకుని, వారితో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా కొత్త పనులు ఈ సమయంలో ప్రారంభించడం కూడా మంచిది కాదు. మాట్లాడే క్రమంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే డ్రైవింగ్‌ చేసే క్రమంలో గాయాలు కూడా కలగొచ్చు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News