)
Mercury Transit Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు అధిపతిగా బుధుడిని చెప్పకుంటూ ఉంటారు. శక్తివంతమైన గ్రహాల్లో బుధ గ్రహం కూడా ఒకటి. ఈ గ్రహం అనుగ్రహం ఉన్న రాశులవారికి జీవితంలో తిరుగు ఉండదు..ఇదిలా ఉంటే ఈ బుధ గ్రహం డిసెంబర్ 20న జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. ఈ సంచారం శనివారం ఉదయం 6:13 గంటలకు ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ బుధుడి సంచారం జ్యేష్ఠ నక్షత్రంలో మొదటి స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు కమ్యూనికేషన్ పరంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే కొన్ని రాశులవారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, మరో 24 గంటల్లో అద్భుతమైన లాభాలు పొందబోతున్న రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి అద్భుతమైన లాభాలు:
తుల రాశి
బుధ సంచారంతో తులా రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కలుగుతాయి. దీంతో పాటు గణనీయమైన ఆర్థిక లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీర్ఘ ప్రయాణాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతోంది. అలాగే సంబంధాల్లో కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతుంది. వీరికి ఈ సమయంలో ఇతరులతో మాట్లాడాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. ప్రతి పనిలో అద్భుతమైన ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. దీంతో పాటు ప్రేమ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో వస్తున్న విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆలోచనలు మరింత లోతుగా మారుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్ పరంగా కూడా అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. ప్రయాణాలు చేయడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.
మిథున రాశి
మిథున రాశివారికి కూడా మరో 24 గంటల్లో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి వ్యాపారాల పరంగా మంచి ఒప్పందలు కూడా లభిస్తాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టుల నుంచి అద్భుతమైన విజయాలు సాధించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఒంటరిగా ఉన్న వ్యక్తులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చదువుతున్న విద్యార్థులు కూడా అద్భుతమైన లాభాలు పొందుతారు. వీరికి ఈ సమయంలో అనుకున్న లాభాలు కూడా కలుగుతాయి.
కన్య రాశి
బుధుడి సంచారం ఎఫెక్ట్‌తో కన్య రాశివారికి ఈ సమయం చాలా బాగుంటుంది. అంతేకాకుండా భౌతిక అనందం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వీరికి సౌకర్యాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా స్నేతుల సహాకారంతో సంపాదించే అవకాశాలు ఉన్నాయి. విద్యా జీవితం కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది. అలాగే జీవితంలో వస్తున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు సహోద్యోగులతో మంచి సంబంధాలు కూడా ఏర్పరుచుకుంటారు. దీంతో పాటు ఎన్నో సమస్యలు కూడా తొలగిపోతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించింది. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు. అలాగే ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook