Black King Cobra Video Watch: ఇదెక్కడి మాస్ రా మామ.. గ్లాసెడు నీటిని తాగిన బ్లాక్ కింగ్ కోబ్రా.. వీడియో చూసి అందరూ షాక్..

Black King Cobra Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో గాజు గ్లాసులో బ్లాక్ కింగ్ కోబ్రా నీటిని తాగుతున్న వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో మీరే చూడండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 22, 2025, 07:06 AM IST
Black King Cobra Video Watch: ఇదెక్కడి మాస్ రా మామ.. గ్లాసెడు నీటిని తాగిన బ్లాక్ కింగ్ కోబ్రా.. వీడియో చూసి అందరూ షాక్..

Rare Black King Cobra Drinking Water Video Watch Here: సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన పాముల్లో నల్ల రంగు కింగ్ కోబ్రాలు ఒకటి. వీటిని చాలా ప్రమాదకరమైన విషపూరితమైన పాములుగా చెప్పుకుంటారు. ఇవి దాదాపు ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగులోకి మారతాయని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. వీటి శరీరం నలుపు రంగులో ఉన్నప్పటికీ గోధుమ రంగులో ప్రత్యేకమైన చారాలను కలిగి ఉంటాయి. అలాగే వీటి పొడవు దాదాపు పది నుంచి 13 అడుగులను కలిగి ఉంటాయి. అంతేకాకుండా కొన్ని పాములు అయితే 18 అడుగులకు పైగానే ఉంటాయని సమాచారం. ఇవి దాడి చేసే క్రమంలో కోపానికి గురైతే వాటి తలభాగం ఉబ్బి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా పడగ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఒక్కసారి దాడి చేస్తే జీవితాన్నే రిస్క్ లో పడేసినట్లని కొంతమంది చెబుతున్నారు. 

Add Zee News as a Preferred Source

నలుపు రంగు కింగ్ కోబ్రాలో న్యూరోటాక్సిక్ అనే విషం ఉంటుంది. ఇది చాలా విషపూరితమని.. ఈ నలుపు రంగు కింగ్ కోబ్రా దాడి చేస్తే నాడీ వ్యవస్థ పై ప్రభావం పడి మరణం సంభవించవచ్చు. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి గుండె ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సరైన సమయంలో చికిత్స పొందడం వల్ల బ్రతికి బట్టకట్టే అవకాశాలున్నాయి. సాధారణంగా నలుపు రంగు కింగ్ కోబ్రాలు కేవలం కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా ఇవి అమెజాన్ అడవుల్లో చిత్తడి నేలల్లో కనిపిస్తాయి. అప్పుడప్పుడు భారతదేశంలో కూడా కనిపిస్తూ ఉంటాయి.

సాధారణంగా నలుపు రంగు కింగ్ కోబ్రాలు, ఎరుపు రంగులో ఉండే కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అంతేకాకుండా కొంతమంది వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఈ వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో లో ఒక నలుపు రంగు కింగ్ కోబ్రా ఏకంగా ఒక యువకుడు గ్లాసులో అందించిన నీటిని తాగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

తాజాగా వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు నేరుగా కింగ్ కోబ్రాకి ఒక గాజు గ్లాస్‌తో నీటిని తన తల ముందు ఉంచాడు. అయితే ఆ పాము కూడా ఏమాత్రం దాడి చేయకుండా ఆ గ్లాసులో ఉన్న నీటిని చక చకా తాగింది. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆ యువకుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. బ్లాక్‌ కింగ్‌ కోబ్రా డ్రింకింగ్ వాటర్ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News