Mercury Retrograde 2022: బుధుడు సెప్టెంబర్ 8న కన్యారాశిలో అస్తమించి.. సెప్టెంబరు 10న అదే రాశిలో తిరోగమనం చేశాడు. అక్టోబరు 2 వరకు తిరోగమనంలో (Mercury Retrograde 2022) ఉంటూ... అక్టోబరు 26 వరకు అదే రాశిలో సంచరిస్తాడు. తెలివితేటలు, వ్యాపారం, సంపదకు కారకుడు మెర్య్కూరీ. బుధుడు తిరోగమన ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. బుధుడి తిరోగమనం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి తిరోగమన ప్రభావం...
మెర్క్యురీ తిరోగమనంలో ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే బుధుడి యొక్క వంకర కదలిక ప్రజల కమ్యూనికేషన్‌పై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. తిరోగమన బుధుడు కారణంగా అనవసర వివాదాలు తలెత్తుతాయి.  నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజలు ఇబ్బందులు పడతారు. అష్ట గ్రహాలు బలహీనమైన మరియు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. మరోవైపు, తిరోగమన బుధుడు ప్రభావం ఎవరిపై ఉంటుందో ఆ వ్యక్తులు అపారమైన డబ్బును పొందుతారు. 


తిరోగమన బుధుడు ఈ వ్యక్తులకు శుభప్రదుడు..
మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు మరియు కుంభరాశి వారికి కన్యారాశిలో బుధుడు తిరోగమనం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వ్యక్తులు ఉద్యోగ మరియు వ్యాపారాలలో చాలా లాభాలను పొందుతారు. కెరీర్‌లో ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. వీరు భారీగా డబ్బు సంపాదిస్తారు. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. 


ఈ రాశులవారు జాగ్రత్త..
బుధుని తిరోగమన సంచారం వృషభం, మిథునం, తులారాశుల వారికి మంచిది కాదు. ఈ వ్యక్తుల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. డిపాజిట్లు ఖర్చవుతాయి. లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. లక్ మీకు కలిసిరాదు.  ఉద్యోగంలో మార్పు రావచ్చు. ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన రాశిచక్రాల వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుంది.


Also Read: Budh Vakri 2022: అక్టోబర్ 2 వరకు తిరోగమనంలో బుధుడు.. లక్కీ, అన్ లక్కీ రాశులివే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook