)
Laxmi Narayan Yoga Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాజయోగాలు చాలా శుభప్రదమైనవిగా భావిస్తారు. ఈ రాజయోగాలు ఏర్పడితే మొత్తం అన్ని రాశుల వారిపై అద్భుతమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆయా రాశుల వారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే వీటి ప్రభావం ప్రపంచం, భూమిపై కూడా పడుతుంది. దీనివల్ల ప్రజల్లో కీలకమైన మార్పులు కూడా వస్తాయి. ఇదిలా ఉంటే నవంబర్ నెలలో గ్రహాలకు అధిపతి అయిన బుధుడు, సంపదకు సూచికగా భావించే సూర్యుడు రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. దీనివల్లే ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగ ప్రభావం మొత్తం మూడు రాశుల వారిపై పడుతుందని జ్యోతిష్యుడు చెబుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలు పొందుతారు. అదృష్టం కలిసి వచ్చి ఊహించని స్థాయిలో ధన లాభాలు పొందుతారు.
ఈ రాశులవారిపై లక్ష్మీనారాయణ రాజయోగం ఎఫెక్ట్:
మకర రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల మకర రాశి వారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కెరీర్, వ్యాపారాలపరంగా ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి కూడా లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు చేసే వారికి అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి. దీంతోపాటు వీరికి కార్యాలయాల్లో ఉన్నత అధికారుల సపోర్టు లభించి ఇమేజ్ కూడా పెరుగుతుంది. దీంతోపాటు కెరీర్ పరంగా అద్భుతమైన ఎత్తుకు ఎదుగుతారు. వ్యాపారవేత్తలకు సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అదృష్టం కూడా పెరిగి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
తులారాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా తులా రాశి వారికి ఈ సమయం చాలా సానుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మొదటి స్థానంలో ఈ శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల వీరికి వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు అవివాహితులకు వివాహాలు కూడా జరిగే అవకాశాలున్నాయి. ఇక సమాజంలో గౌరవంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయని జ్యోతిష్యుడు చెబుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ప్రతి ప్రయత్నంలో చక్కని విజయాలు సాధించగలుగుతారు. జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చి కొత్త బాధ్యతలను స్వీకరించగలుగుతారు.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడడం వల్ల జీవితంలో సానుకూలమైన మార్పులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఈ లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. మీ రాజయోగం వల్ల విదేశాల్లో పనులు చేస్తున్న వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకు ప్రయాణించాలనుకునే వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్టులలో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. దీనివల్ల వీరికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook