Chandra Grahan Transit: చంద్రుడి ఎఫెక్ట్‌.. డిసెంబర్‌లో ఈ రాశులవారి జీవితాల్లో అద్భుత మార్పులు!

Chandra Grahan Transit: చంద్ర గ్రహ సంచారంతో డిసెంబర్‌లో కొన్ని రాశులవారు అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఆర్థికంగా కూడా ఈ రాశులవారికి కలిసి రాబోతోంది. అయితే, ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 5, 2025, 01:56 PM IST
Chandra Grahan Transit: చంద్రుడి ఎఫెక్ట్‌.. డిసెంబర్‌లో ఈ రాశులవారి జీవితాల్లో అద్భుత మార్పులు!

Chandra Grahan Transit Effect On Zodiac: మరికొన్ని రోజుల్లోనే 2025 సంవత్సరం పూర్తి కాబోతోంది. మరో 25 రోజుల్లో కొత్త 2026 సంవత్సరం రాబోతోంది. అయితే, పాత, కొత్త సంవత్సరాల్లో అనేక గ్రహాల కదలికలు చాలా ప్రత్యేకమైనది భావిస్తారు. ముఖ్యంగా సూర్య, చంద్ర గ్రహాల కదలికలు చాలా శుభప్రదమైనది భావిస్తారు. ముఖ్యంగా చంద్రుడు అన్ని గ్రహాల కంటే చాలా స్పీడ్‌గా కదలికలు జరుపుతాడు. దీని కారణంగా అన్ని రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చంద్రుడు ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒక్కసారి సంచారం చేస్తూ ఉంటాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు నక్షత్ర సంచారం చేస్తాడు. ఇలాంటి సందర్భాల్లో రాజయోగాలు కూడా ఏర్పడుతాయి. 

Add Zee News as a Preferred Source

చంద్రగ్రహాన్ని మనస్సు, మానసిక స్థితి, తల్లి, ఆనందానికి సూచికగా భావిస్తారు. కాబట్టి ఈ గ్రహం రాశి, నక్షత్ర సంచారం చేస్తే మొత్తం అన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తూ ఉంటాయి. ఒక ఏడాదిలో ఈ గ్రహం 161 సార్లు సంచారం చేస్తుంది. అంతేకాకుండా చంద్రగ్రహం 361 సార్లు నక్షత్ర సంచారం చేస్తుంది. అన్ని రాశులవారికి ప్రతి నెల ఈ గ్రహ ప్రభావం పడుతుంది. అయితే, ఈ డిసెంబర్‌ నెలలో కూడా చంద్రుడు రాశి సంచారం చేస్తాడు. ఈ నెలలో చంద్రుడు ఏయే రాశుల్లో, ఎప్పుడెప్పుడు సంచారం చేస్తాడో ఇప్పడు మనం తెలుసుకుందాం..

Also Read: Richest Zodiac Signs: 2026లో ఈ రాశులవారు ధనికులు కాబోతున్నారు.. అదృష్టవంతులు వీరే!

డిసెంబర్‌ నెలలో చంద్రుడి సంచారం:
చంద్రగ్రహం ఈ డిసెంబర్‌ నెలలో మొత్తం 13 సార్లు రాశి సంచారం చేస్తాడు. ముందుగా డిసెంబర్ 7న కర్కాటక రాశిలో సంచారం చేస్తుంది. అలాగే 10న సింహరాశిలో సంచారం, డిసెంబర్ 12న కన్యాలోకి, 4న తులారాశిలోకి, 17న వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంది. ఇక డిసెంబర్ 19న ధనుస్సు రాశిలో సంచారం, 22న మకర రాశిలో,  24న కుంభ రాశిలోకి సంచారం చేస్తుంది. అంతేకాకుండా డిసెంబర్ 27న మీన రాశిలో సంచారం, 29న మేష రాశిలో, 31న వృషభ రాశిలో సంచారం చేస్తుంది.

చంద్రుడి సంచారంతో కొన్ని రాశులవారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. ముఖ్యంగా వృత్తిపరమైన జీవితంలో కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ గ్రహ సంచారంతో ఎక్కువగా వృషభం, మిథున రాశితో పాటు కర్కాటక రాశివారు ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు కన్య రాశి, తులా రాశి, వృశ్చిక రాశితో పాటు మకరరాశి, కుంభ రాశి, మీన రాశులవారు కూడా అత్యధిక లాభాలు పొందుతారు. 

Also Read: Richest Zodiac Signs: 2026లో ఈ రాశులవారు ధనికులు కాబోతున్నారు.. అదృష్టవంతులు వీరే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News