Coconut Facts: దేవుడికి కొబ్బరికాయల్ని కొట్టి ఈ పనులు చేశారో.. ఏడు జన్మల్లో కూడా ఆ పాపం మిమ్మల్ని వదిలి పోదు...!

coconut offering to god: చాలా మంది ఇంట్లో పూజలు చేసిన లేదా గుడికి వెళ్లిన కూడా కొబ్బరికాయల్ని తప్పకుండా తీసుకొని వెళ్తుంటారు. అయితే.. కొబ్బరికాయల్నికొట్టడంవెనకాల కూడా నిగూఢమైన అర్థం దాగుందని పండితులు చెబుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 4, 2025, 04:40 PM IST
  • కొబ్బరికాయ నియమాలు..
  • పలు సూచనలు చేసిన పండితులు..
Coconut Facts: దేవుడికి కొబ్బరికాయల్ని కొట్టి ఈ పనులు చేశారో.. ఏడు జన్మల్లో కూడా ఆ పాపం మిమ్మల్ని వదిలి పోదు...!

Coconut significance and some facts: సాధారణంగా హిందుసంప్రదాయంలో కొబ్బరికాయకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. అంతే కాకుండా.. దీన్ని పూర్ణఫలంగా చెబుతారు.  కొబ్బరికాయను చాలా మంది పూజల్లో, గుడులకు వెళ్లినప్పుడు తప్పకుండా తీసుకొని వెళ్తుంటారు. అయితే.. నిజానికి కొబ్బరి కాయను మనిషితలతో పోలుస్తారు. మన జుట్టును, దానికున్న పీచుగా చెబుతారు.

Add Zee News as a Preferred Source

అంతే కాకుండా.. కొబ్బరి కాయను కొట్టిన తర్వాత వచ్చే లేత కొబ్బరిని మన మనస్సుగా చెబుతుంటారు. అంటే.. ఎలాంటి కల్మషం, అహాంకారం, ఇతరులపై ద్వేషం, చెడు చేయాలనే ఆలోచన, కుటీల బుద్ది లేదని.. కేవలం కొబ్బరిలోని తెల్లని కొబ్బరిలాగా.. తమ మనస్సును ఆ దేవుడికి అర్పిస్తున్నామన్న దానికి సంకేతంగా కొబ్బరికాయల్ని భక్తులు కొడుతారు.  చాలా మంది కొబ్బరికాయల్నికొట్టిన తర్వాత కొంతమంది కొబ్బరి ముక్కల్ని ప్రసాదంగా తింటారు.

మరికొందరు చక్కెర వేసి చట్నీలు చేసుకుంటారు. అయితే.. కొబ్బరి కాయల్ని కొంత మంది కొట్టిన తర్వాత.. చికెన్, మటన్ లలో  వేసుకొవడంవంటి పనులు చేస్తారు. అయితే.. ఈ పని వల్ల చాలా పాపం వస్తుందని.. అది ఏడు జన్మలవరకు వదలదని పండితులు చెబుతున్నారు. మనం కొబ్బరికాయల్ని కొట్టి ఆ దేవుడి ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తాం. అలాంటి ప్రసాదం కొబ్బరికాయల్ని మాంసాహారాలో వినియోగిస్తే మాత్రం లేని పోనీ దోషాలు చుట్టుకుంటాయని పండితులు చెబుతున్నారు.

Read more: Ashadham: జూన్‌ నెలలో ఆషాఢం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏ పనులు చేయకూడదు..?

అయితే.. పూజల్లో కొన్నిసార్లు కుళ్లిపోయిన కొబ్బరికాయ రావడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో అస్సలు భయపడాల్సిన అవసరంలేదు. అది దేవుడికి చెందిందని పండితులు చెబుతున్నారు. మరికొన్నిసార్లు కొబ్బరిలో తెల్లని పువ్వు వస్తుంది. ఇది అత్యంత శుభప్రదం అని రాబోయే మంచి రోజులకు సంకేతం అని పండితులు సూచిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News