Dahi Handi 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి మరుసటి రోజు జరుపుకునే ఫెస్టివల్ దహీ హండి పండుగ. ఈ పండుగను భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం జన్మాష్టమిని ఆగస్టు 18న జరుపుకుంటున్నారు. అయితే మధురలో మాత్రం జన్మాష్టమిని ఆగస్టు 19న జరుపుకోనున్నారు. అయితే దహీ పండుగను (Dahi Handi 2022) ఆగస్టు 19, శుక్రవారం నాడు జరుపుకోనున్నారు. ఈ ఫెస్టివల్ ను ప్రధానంగా మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ముఖ్యంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో దహీ హండి పండుగను గోపాల్కళ అంటారు. దీని యెుక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధృవ యోగంలో దహీ హండి పండుగ
ఈసారి దహీ హండి పండుగ రోజున ధ్రువ యోగం ఏర్పడింది. ఈ యోగం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఈ యోగం శుభ కార్యాలకు శుభప్రదంగా భావిస్తారు.


దహీ హండి పండుగ అంటే ఏమిటి?
దహీ హండి పండుగ రోజున.. ఉట్టి కొట్టడం అనవాయితీగా భావిస్తారు. ఈ ఉట్టిని కొట్టేందుకు చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఎగబడతారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉట్టి కొట్టడానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ కుండను పగలుగొట్టే వ్యక్తిని గోవింద అంటారు. ముందుగా ఎవరైతే ఉట్టిని కొడతారో ఆ వ్యక్తికి బహుమతి ఇస్తారు. 


దహీ హండి చరిత్ర 
పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుని బాల్యం గోకులంలో గడిచింది. శ్రీకృష్ణుడు బాగా అల్లరివాడు.  ఇతడికి వెన్న, పాలు, పెరుగు మొదలైనవి అంటే చాలా ఇష్టం. వీటిని చిన్ని కృష్ణుడు దొంగలించి తినేవాడు. తన స్నేహితులతో కలిసి వెన్న కుండలను పగలగొట్టడం దొంగతనం చేయడం చేసేవాడు. కృష్ణుడి ఆగడాలు భరించలేక గ్రామస్తులంతా తల్లి యశోదకు ఫిర్యాదు చేశారు. కృష్ణుడి అల్లరి తట్టుకోలేక గోపికలు తమ ఇళ్లలో తాడు సహాయంతో వెన్న, పెరుగు కుండలను చాలా ఎత్తులో ఉంచేవారు. అయినా సరే శ్రీకృష్ణుడిని వాటిని ఏదోలాగా తినేసేవాడు. అప్పటి నుండే దహీ పండుగ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 


Also Read: సింహరాశిలో సూర్య సంచారం.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం, పరిహారాలు తెలుసుకోండి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook