)
Dead People Dream In Telugu: స్వప్న శాస్త్రంలో వివిధ రకాల కలలకు సంబంధించిన అన్ని అంశాలను ఎంతో క్లుప్తంగా వివరించారు. ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కలలకు కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని పేర్కొన్నారు. అయితే చాలామందికి తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయా? కాదా అనే సందేహం ఉంటుంది. అయితే, దీని గురించి కూడా ఈ స్వప్న శాస్త్రంలో ఎంతో క్లియర్ గా వివరించారు. ఇదిలా ఉంటే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో వచ్చి కలలన్నీ.. భవిష్యత్తు గురించి వివరిస్తాయని సమాచారం. అందుకే ఆ సమయంలో వచ్చే కలలన్నీ అప్పుడప్పుడు నిజమవుతూ ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో వచ్చే ఏయే కలలు నిజమవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చనిపోయిన వ్యక్తులు కలలో చూడడం..
స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన వ్యక్తులు బ్రహ్మ ముహూర్తంలో కలలో కనిపిస్తే.. వారికి మీతో మాట్లాడాలని లేదా మీకు ఏదైనా చెప్పాలని కోరుకుంటున్నట్లు అర్ధాన్ని అందిస్తుంది. అతను సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తే మంచి సంకేతంగా పరిగణించవచ్చు. కానీ అతను కలలు సంతోషంగా లేకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.
వెలుతురు కల..
మనం అప్పుడప్పుడు కలలో ఎక్కువగా వెలుతురిని చూస్తూ ఉంటాం.. నిజానికి ఇలా ఎక్కువ వెలుతురు కనిపించడం స్వప్న శాస్త్రం ప్రకారం చాలా మంచిది. ఇలా కనిపిస్తే ఆధ్యాత్మికత జ్ఞానోదయం పెరుగుతుంది. అంతేకాకుండా జీవితంలో అనేక మంచి రోజులు రావడం ప్రారంభమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కలలో నీటిని చూడడం..
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నీటిని చూడడం అంటే వివిధ అర్ధాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కలల్లో వారు స్వచ్ఛమైన నీటిని చూస్తే మానసిక సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని ఒక ప్రత్యేకమైన అర్ధాన్ని తెలియజేస్తుందట. అంతేకాకుండా కలలు కంటున వారు.. ఈత కొట్టినట్లు కనిపిస్తే జీవితంలో ఊహించని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కలలో దేవుడు..
బ్రహ్మ ముహూర్తంలో మీరు దేవుడిని కలలో చూడడం కూడా చాలా అదృష్టంగా భావించవచ్చట.. ఇలా ఈ సమయంలో కలలో దేవుడు కనిపిస్తే సాక్షాత్తు ఆ దేవుడే నీకు ప్రత్యక్షమై ఆశీర్వదిస్తున్నట్లు ప్రత్యేకమైన అర్ధాన్ని తెలియజేస్తుందట. దీనివల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు.
ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోతున్నట్లు కలలో కనిపించడం..
స్వప్న శాస్త్రం ప్రకారం చాలామంది ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోతున్నట్లు కలలు కంటూ ఉంటారు. దీని అర్థం కొంత ఆందోళనతో బాధపడుతున్నారని అర్ధాన్ని అందిస్తుంది. అలాగే దీనివల్ల మనసులో ప్రతికూల ఆలోచనలు కూడా విపరీతంగా పెరుగుతాయని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి