)
Diwali 2025: ఆశ్వయుజ మాస ప్రారంభమైన మొదటి రోజైన పాడ్యమి నుంచి దశమి వరకు దసరా నవరాత్రులతో పాటు విజయ దశమిని ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఇదే మాసంలో చివరి రోజైన ఆశ్వయుజ మాసం చివరి రోజైన అమావాస్య రోజున దీపావళిని జరుపుకుంటాము. సాధారణంగా అన్ని పండగలను సూర్యోదయం పూట ఏ తిథి ఉంటుందో ఆ రోజున పండగ జరుపుకోవడం ఆనవాయితీ. కానీ మహా శివరాత్రి,గణేష చతుర్ధి, కృష్ణాష్టమి, దీపావళి పండగలకు జరుపుకోవడానికి ప్రత్యేక నియమ నిబంధనలున్నాయి.
అమావాస్య తిథి ప్రదోశ కాలంతో పాటు అర్ధరాత్రి 12 గంటలకు ఉండాలనేది నియమం. ఈ యేడాది అక్టోబర్ 20వ తేదినే నరక చతుర్దశితో పాటు దీపావళి పండగను జరుపుకోవాలి. ఈ పండగ విశిష్ఠతపై కాశీ విద్వత్ పరిషత్ క్లారిటీ ఇచ్చింది. దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి ప్రదోష కాలం సాయంత్రం 5.46 నుంచి రాత్రి 8.18 గంటలకు ఉండటంతో ఆ రోజున దివ్వెల పండగ దీపావళి జరుపుకోవాలని చెబుతుంది.
సాధారణంగా ఆశ్వయుజ అమావాస్య రోజున స్వాతి నక్షత్రంతో కూడి వస్తోంది. ఈ సారి మాత్రం సోమవారం.. చతుర్దశి తర్వాత సాయంత్రం అమావాస్య తిథి రోజున హస్త నక్షత్రం రాత్రి 8 గంటల వరకు ఉంది. ఆ తర్వాత చిత్ర నక్షత్రం ప్రవేశిస్తోంది. ఇక తొలిసారి కేదారేశ్వర వత్రం చేసుకునేవాళ్లు.. కార్తీక మాసం ప్రతిపథ రోజున స్వాతి నక్షత్రం కూడి ఉంది. ఆ రోజున ఈ వ్రతం మొదటిసారి చేసేవాళ్లు ఆచరించాలనేది శాస్త్రం చెబుతున్న మాట. దీపావళి మొత్తం ఐదు రోజుల పండగ. దీపావళి రెండు రోజుల ముందు ధన త్రయోదశి.. ఆ తర్వాత నరక చతుర్దశి, దీపావళి, ఆ తర్వాత బలి పాడ్యమి, యమ విదియ ఉంటుంది. యమ విదియను ఉత్తర భారతీయులు భాయ్ దూజ్ గా ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.