)
Diwali festival 2025 Pitru dosh symptoms and remedies: ముఖ్యంగా చాలా మంది ఇటీవల కాలంలో జీవితంలో సరైన విధంగా ఎదుగుదల లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొంత మందికి పెళ్లిళ్లు సెటిల్ కాక తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇంట్లో తరచుగా గొడవలు, మనశాంతిలోపించడం వంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం.అయితే.. వీటిని ముఖ్యంగా పూర్వీకుల శాపాలు, పితృ దోషాలు కారణంగా చెప్తుంటారు.
చనిపోయిన పూర్వీకులకు సరైన విధంగా దహన సంస్కారాలు, శాంతులు, దానాలు చేయకుంటే పూర్వీకులు వారి వారసులపై కోపంతో రగిలిపోతారు. అంతేకాకుండా.. ఎలాగైతే తాము సంపాదించిన ఆస్తుల్ని పిల్లలకు ఇస్తారో.. అదే విధంగా కొన్ని బాధ్యతల్ని తమ తర్వాత వారు బాధ్యతలు నెరవేరుస్తారని భావిస్తారు. ఈ విషయాల్లో కనుక సరైన విధంగా జరక్కపోతే.. వారి ఆత్మకు శాంతి దొరక్క.. ఆత్మ రూపంలో తిరుగుతుంటారని చెబుతారు.
ఇలాంటి వారు వారి వారసులపై కోపంతో వారిని శాపాలు ఇచ్చి, పీడిస్తారు.దీని వల్ల వారి జీవితంలో ఏ విధమైన ఎదుగుదల కూడా ఉండదు.ఈ క్రమంలో మనం అక్టోబర్ 20న దీపావళి జరుపుకోబోతున్నాం. అయితే.. ఈసారి రెండు రోజుల దీపావళిని జరుపుకుంటున్నారు. అమావాస్య సోమవారం మధ్యాహ్నం వస్తుంది. మంగళవారం సూర్యోదయంకు ఉంది. దుకాణాల్లో పూజలు చేసే వారు రాత్రి తిథికి పూజలు చేస్తారు.
కానీ చాలా మంది సూర్యోదయం తిథికి పూజలు చేస్తారు. దీని బట్టి ఈసారి రెండు రోజులపాటు దీపావళిని జరుపుకుంటున్నారు. అయితే.. దీపావళి రోజున పూర్వీకుల శుభాశిస్సుల కోసం కొన్ని పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన వస్తువుల దానంతో పాటు, బ్రాహ్మణుడికి భోజనం, వస్త్రదానం, దీపదానంలు చేయాలి.
అదే విధంగా పూర్వీకులకు చాలా ఇష్టమైన పదార్థాలను చేసి పేద వారికి దానంచేయాలి. అమావాస్య రోజున శ్రాధ్దకర్మాదికాలు చేయాలి. దీనితో పాటు ఆవుకు మంచిగా గ్రాసం పెట్టాలి. అమావాస్య రోజున ప్రదోష సమయంలో దక్షిణం దిక్కున దీపం వెలిగించి పూర్వీకుల పేర్లు తీసుకుని వారిని వేడుకోవాలి.
ముఖ్యంగా పూర్వీకులు ఎవరి మీద అయితే వారి మనస్సు ఉంటుందో.. వారిని పిలిచి ఇష్టమైనవి చేసి, వారిని ఫుల్ గా సాటిసై ఫై చేసి, వారి ఆశీర్వాదం పొందాలి. ఇలా చేస్తే మన పూర్వీకులు శాంతించి మంచి శుభయోగాలు కల్గేలా ఆశీస్సులు ఇస్తారని పండితులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.