
Kuja Powerful Effect On Zodiac: కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్క గ్రహం తప్పకుండా కదలికలు జరుపుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహం నక్షత్ర సంచారం చేస్తే.. మరోసారి రాశి సంచారం చేస్తుంది. ఇలా చేసినప్పుడు ప్రతి వ్యక్తి జీవితం పై ప్రత్యేకమైన ప్రభావం చూపుతూ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే దీని కారణంగా ప్రకృతిలో కూడా అనేక మార్పులు సంభవిస్తాయని వారు అంటున్నారు. ఈ గ్రహ సంచారాలపరంగా సెప్టెంబర్ నెల చాలా ప్రత్యేకతను కలిగి ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. సెప్టెంబర్ 23వ తేదీన ఎంతో ప్రత్యేకత కలిగిన కుజుడు రాహువుకు ఎంతో ఇష్టమైన స్వాతి నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో కుజుడు తులా రాశిలో సంచార దశలో ఉంటూ.. ఈ నక్షత్ర సంచారం చేస్తాడు. దీంతో కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో జీవితంలో అత్యంత మార్పులు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడి సంచారం అనేక రాశుల వారిపై సానుకూలమైన ప్రభావాన్ని చూపబోతోంది. ఈ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో ధైర్యంతో పాటు బలం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా రక్తం పంచుకొని పుట్టిన సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే కోపంతో చేసిన పనులన్నీ తానుకూలంగా మారుతాయి. కుజుడి ప్రభావంతో జీవితంలో ఎన్నడూ పొందలేని అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ఈ సమయంలో అనుకున్న పనులన్నీ కూడా వెంటవెంటనే జరిగిపోతాయి..
వృషభ రాశి:
వృషభ రాశి వారికి కుజుడి సంచార ప్రభావం వల్ల ధైర్యం విపరీతంగా పెరుగుతుంది. వీరికి ఇంట్లో సానుకూలమైన శక్తులు విపరీతంగా పెరిగి సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో విద్యార్థులకు చాలా బాగుండబోతోంది. ముఖ్యంగా కెరీర్ కు సంబంధించిన జీవితం చాలా వరకు మెరుగుపడుతుంది. విద్యార్థులకు దిశా నిర్దేశం చేయడం వల్ల భవిష్యత్తు చాలా బాగుంటుంది. అలాగే షాపులు నడుపుతున్న వారికి గతంలో అప్పులన్నీ ఇప్పుడు తీరబోతున్నాయి. వ్యాపారాలు సక్రమంగా సాగడం వల్ల వాటిని విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం కూడా చాలావరకు సహకరించి వృద్ధులు ఎంతో ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కుజుడు ఎన్నో రకాల శుభ ఫలితాలను అందించబోతున్నాడు. సెప్టెంబర్ నెల నుంచి వీరికి మానసిక ప్రశాంతత మెరుగుపడడమే కాకుండా కెరీర్ కు సంబంధించిన ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోబోతున్నాయి. అంతేకాకుండా వీరు మంచి వ్యక్తిత్వంతో ముందుకెళ్లబోతున్నారు. అలాగే వృద్ధులు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. పాత పెట్టుబడులనుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా సంపాదించగలుగుతారు. యువకులు ఈ సమయంలో అకస్మాత్తుగా సంపాదనను కూడా పొందగలుగుతారు. అలాగే ఈ సమయంలో పెద్దపెద్ద సమస్యల నుంచి కాస్త పరిష్కారం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.
కుంభరాశి :
కుంభ రాశి వారికి కుజుడి సంచారం కారణంగా ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా వీరి సెప్టెంబర్ నెల నుంచి మునుపటి కంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు వృద్ధులతో కలిసి చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతారు. అలాగే ఇంట్లో గతంలో ఉన్న పాత ఆస్తుల వివాదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక వివాహితులకు ఈ సమయం చాలా బాగుండబోతోంది. అలాగే భాగస్వామ్య జీవితం గడుపుతున్న వారికి సంబంధాలు చాలా వరకు మెరుగు పడబోతున్నాయి. జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే పూర్తిగా తొలగిపోతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి