Mahalakshmi Yoga Effect: కుజుడి - చంద్రుడి మహా లక్ష్మీ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి డబ్బుల వర్షం కురిపించబోతున్న లక్ష్మీదేవి..

Mahalakshmi Yoga In Vedic Astrology: చంద్రుడు కుజుడు వృశ్చిక రాశిలో కలయిక జరపడం కారణంగానే మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగ ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాలు మారబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికంగా కలిసి రాబోతూ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 14, 2025, 01:09 PM IST
Mahalakshmi Yoga Effect: కుజుడి - చంద్రుడి మహా లక్ష్మీ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి డబ్బుల వర్షం కురిపించబోతున్న లక్ష్మీదేవి..

Mahalakshmi Yoga In Vedic Astrology: అన్ని గ్రహాలకు శక్తినిచ్చే గ్రహం కుజుడిని చెప్పుకుంటూ ఉంటారు. ఈ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ఒక నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తుంది.  అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. ఈ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేయడానికి దాదాపు 18 నెలల పాటు సమయం పడుతుంది. ప్రస్తుతం కుజుడు సొంత రాశిలో సంచార దశలో ఉన్నాడు. అయితే ఈ నవంబర్ నెలలో తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలోనే అద్భుతమైన యోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా కుజుడు వృశ్చిక రాశిలోకి వెళ్లడం వల్ల చంద్రుడితో కలయిక జరిపే అవకాశాలున్నాయి. దీని కారణంగానే మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ మహాలక్ష్మి రాజయోగాన్ని ఎంతో శక్తివంతమైన యోగంగా చెప్పుకుంటూ ఉంటారు జాతకంలో ఈ యోగం ఏర్పడితే.. రాశుల వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. 

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడు చంద్రుడి అద్భుతమైన కలయిక కారణంగా మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగంతో అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. అలాగే విశ్వాసం పెరిగి ధైర్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జీవితంలో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. 

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు మహాలక్ష్మి రాజయోగం అద్భుతమైన ఆర్థిక లాభాలను అందించబోతోంది. ముఖ్యంగా వీరికి అనుకోని డబ్బులను ప్రసాదించబోతోంది. అలాగే ఉద్యోగస్తులకు ఈ సమయంలో తప్పకుండా ప్రమోషన్స్ లభిస్తాయి. దీంతోపాటు కొత్త ఆదాయ మార్గాలు కూడా వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. గతంలో ఇతరులకు ఇచ్చే డబ్బు కూడా ఈ సమయంలో ఎంతో సులభంగా తిరిగి చెల్లించగలుగుతారు.

మీన రాశి 
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు మహాలక్ష్మీ రాజయోగం ప్రభావంతో ఊహించని ప్రయోజనాలు కలుగబోతున్నాయి. ముఖ్యంగా వీరికి మానసిక ప్రశాంత ఈ సమయంలో ఊహించని స్థాయిలో పెరుగుతుంది. సీనియర్ అధికారుల నుంచి అద్భుతమైన సపోర్టు లభించి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలు కూడా లాభసాటిగా మారే అవకాశాలున్నాయి. ఆర్థికపరమైన అడ్డంకులు కూడా తొలగిపోతాయి.

Also Read: Shani Dev Effects: నవంబర్‌లో శని ప్రత్యక్ష కదలికలు.. ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్.. ఊహించని ఆదాయం!

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు మహాలక్ష్మి రాజయోగం ప్రభావంతో సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆకస్మిక సంపాదన రావడమే కాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ఈ సమయంలో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం వల్ల వచ్చే రోజుల్లో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో కోరుకుంటున్న కలలు నెరవేర్చుకోవాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైనదిగా భావించవచ్చు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు, ఆధ్యాత్మికత పై ఆధారపడి ఉంటుంది. .దీనిని జీ న్యూస్ ధ్రువీకరించదు.)

Also Read: Shani Dev Effects: నవంబర్‌లో శని ప్రత్యక్ష కదలికలు.. ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్.. ఊహించని ఆదాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News