)
Nava Panchama Raja Yoga 2025 Effect On Zodiac Telugu: సెప్టెంబర్ రెండోవారం గ్రహ సంచారాలపరంగా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఎందుకంటే కుజుడు తులా రాశిలోకి సంచారం చేస్తాడు. అలాగే శుక్ర గ్రహ కదలికలు కూడా జరుగుతాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా కుజ, శుక్ర గ్రహాలు స్నేహపూర్వకమైన సంబంధాలు కలిగి ఉంటాయి. దీని కారణంగానే ఈ సమయంలో నవ పంచమి రాజయోగం ఏర్పడబోతోంది. అయితే ఈ యోగం వల్ల సెప్టెంబర్ రెండోవారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా మేష రాశి తో పాటు కర్కాటక ఇతర కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వీరికి శత్రువుల బాధ నుంచి కూడా విముక్తి లభించబోతోంది. అంతేకాకుండా ప్రతి పనిలో వీరు అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో వీరికి కలిసి రాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ రెండోవారం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే ప్రయాణాలు చేయడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణన్ని పొంది.. మానసికంగా బోలెడు లాభాలు పొందుతారు. అలాగే పిల్లలు ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ సమయంలో పరిష్కారం పొందగలుగుతారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం చాలా ఆనందాన్ని అందిస్తుంది. వైవాహిక జీవితంలో కూడా ఎన్నో రకాల మార్పులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా అన్ని రకాల సమస్యల నుంచి వీరు పరిష్కారం పొందగలుగుతారు.
మేషరాశి
మేష రాశి వారికి ఈ వారం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు అద్భుతమైన శక్తితో పనులు చేయగలుగుతారు. అంతేకాకుండా మేషరాశి వారు ఓర్పుతో పాటు వివేకంతో సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. దీంతోపాటు స్నేహితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు పొందే అవకాశాలున్నాయి. ఇక భాగస్వామ్య జీవితం కూడా చాలా బాగుంటుంది. అలాగే కుటుంబ భాగస్వామితో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ప్రేమ జీవితం కొనసాగిస్తూ వస్తున్న వారికి ఈ సమయంలో శృంగార భరితమైన కోరికలు కూడా రావచ్చు. ఒకరి మధ్య ఒకరికి మంచి బంధం ఏర్పడి ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది..
కర్కాటక రాశి
సెప్టెంబర్ రెండో వారం కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం మీరు కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. అలాగే వీరు ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీంతోపాటు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త విముక్తి లభిస్తుంది. ఇక భాగస్వామ్య జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. భాగస్వామ్య జీవితంలో వస్తున్న ఎలాంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి