)
Powerful Gajakesari Raja Yoga Effect On Zodiac: ఏడాది పితృ అమావాస్య సెప్టెంబర్ 21వ తేదీన వచ్చింది. ఈ అమావాస్యను మహాలయ అమావాస్య కూడా అని చెప్పుకుంటారు. అలాగే ఇదే రోజు చివరి సూర్యగ్రహణం కూడా సంభవించబోతోంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి చాలామంది ఈరోజు తర్పణం చేస్తారు. ఈ రోజే కొన్ని గ్రహాల కదలికలు కూడా జరుగుతాయి దీని కారణంగా కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా శుక్ల యోగంతో పాటు గజకేసరి రాజయోగం, సర్వార్ధ సిద్దయోగం ఇతర మరికొన్ని యోగాలు ఏర్పడతాయి వీటి ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గజకేసరి రాజయోగం వల్ల కొన్ని రాశుల వారు ఈ సమయంలో అదృష్టవంతులు కాబోతున్నారు.. వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
మిథున రాశి
పితృ అమావాస్య నుంచి మిథున రాశి వారికి శుభ ప్రభావం ప్రారంభమవుతుంది..దీని కారణంగా వీరికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. అలాగే పూర్వికులు ఆశీస్సులు లభించి.. కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త అవకాశాలు రావడమే కాకుండా కుటుంబంలో ఉద్రిక్తతలు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు పిల్లల సంబంధాలు మరింత మెరుగుపడి వారితో ఎంతో ఆనందంగా గడిపేందుకు ఇష్టపడతారు. అలాగే అనేక రకాల ఆర్థికపరమైన సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు నుంచి కెరీర్ పరంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వైవాహిక జీవితం కూడా చాలావరకు మెరుగుపడుతుంది.. అలాగే అకస్మాత్తుగా వ్యాపారాల్లో లాభాలు కూడా పొందగలుగుతారు. జీవితంలో ఆనందం కూడా విపరీతంగా పెరిగి, ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి సానుకూలమైన వాతావరణం కూడా ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ సమయంలో పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.. దీని కారణంగా వీరు దీర్ఘకాలిక కృషికి అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు అలాగే కొత్త వ్యాపారాల ఒప్పందాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చాలావరకు లాభదాయకంగా ఉంటాయి. అంతేకాకుండా గతంలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో ధన లాభాలు పొందగలుగుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి