)
Mercury And Sun Conjunction Effect On Zodiac Telugu: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ సంచారాలు వాటి సంయోగాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు ప్రతి ఒక నెల రాశి సంచారం చేస్తూనే ఉంటాడు. అందుకే ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా సూర్యగ్రహం ఒక సంవత్సరంలోనే మొత్తం 12 గ్రహాల్లో సంచారం చేస్తుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 17వ తేదీన మధ్యాహ్నం సూర్యుడు కన్యా రాశి నుంచి బయలుదేరి తులా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే, తులా రాశిలో బుధుడు ఇప్పటికే సంచార దశలో ఉన్నాడు. దీని కారణంగా అక్టోబర్ 17వ తేదీన ఈ రెండు గ్రహాలు కలయిక జరగబోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనికి కారణంగా ఈ రెండు గ్రహాల కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ధన త్రయోదశికి ముందే ఈ శక్తివంతమైన రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా సహకరించి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మీన రాశి
బుధాదిత్య రాజయోగం వల్ల మీనరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. ఇక ఎప్పటినుంచో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు లభించడమే కాకుండా కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రభుత్వ పనుల్లో నిమగ్నమై ఉన్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకం అందిస్తుంది. అంతేకాకుండా అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక పరిశోధనా రంగంలో కొనసాగుతున్న వ్యక్తులకు ప్రాజెక్టులు కూడా ముందుకు సాగుతాయి. లాటరీ లేదా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు ఈ సమయంలో అనుకున్న దానికంటే భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. ఇక ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు పొంది.. అడ్డంకుల నుంచి విముక్తి పొందుతారు..
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా సూర్య, బుధ గ్రహాల కలయిక వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఈ బుధాదిత్య రాజయోగ ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు వెంటవెంటనే జరుగుతాయి. ముఖ్యంగా వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభించి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆకస్మికంగా భారీ మొత్తంలో డబ్బును పొందగలుగుతారు. జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీంతోపాటు ఆస్తులు భారీ మొత్తంలో పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక తల్లిదండ్రుల మధ్య బంధం మరింత బలపడుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి అక్టోబర్ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి సూర్యుడు పదవ స్థానంలోకి రాబోతున్నాడు. దీని కారణంగా వీరికి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఆత్మగౌరవం కూడా పెరిగి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగాలు లేదా వ్యాపారాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాజెక్టులలో నిమగ్నమై ఉన్నవారు ఈ సమయంలో బోలెడు ప్రయోజనాలు పొందుతారు. అలాగే వ్యాపారాలు చేసే వ్యక్తులు ఊహించని విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో సమాజంలో మంచి కీర్తి, ప్రతిష్టలు కూడా లభిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook