)
Saturn And Sun Conjunction Effect On Zodiac Telugu: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడు ఇటీవలే కన్యా రాశిలోకి సంచారం చేశాడు. మీనరాశిలో శని తిరోగమన స్థితిలో బలపడ్డాడు. శని సూర్య గ్రహాలు ఒకదానికొకటి శత్రువులైనప్పటికీ.. వాటి కలయిక జరిగినప్పుడు, ఒకదానికొకటి వ్యతిరేక దిశలో వచ్చినప్పుడు ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇదే సమయంలో ఒక్కొక్క సమయంలో శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడతాయి. చాలా ఏళ్ల తర్వాత శనితో పాటు గ్రహం ఒకదానికొకటి వ్యతిరేక దిశలోకి వచ్చాయి. అక్టోబర్ 17వ తేదీన శని గ్రహం బలపడ్డాడు. అయితే ఇదే సమయంలో రెండు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కర్కాటక రాశి
శని, సూర్య సంయోగం కారణంగా కర్కాటక రాశి వారికి చాలా శుభ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో తప్పకుండా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో కాస్త ఉపశమనం కలుగుతుంది. కర్కాటక రాశి వారికి పూర్తిగా మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే శుభకార్యాల్లో పాల్గొనే ప్రత్యేకమైన అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా వీరికి కుటుంబంలో శాంతి కూడా విపరీతంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందంగా జీవితాన్ని ముందుకు సాగిస్తారు. అలాగే అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.
తులారాశి
తులా రాశి వారికి ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. బోలెడు లాభాలు కలగడమే కాకుండా పనుల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా అకస్మాత్తుగా ధన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే ఈ సమయంలో భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందగలుగుతారు. ఖర్చులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి..
కుంభరాశి
కుంభరాశి వారికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి కూడా సమాజంలో చాలా గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా హోదా కూడా లభిస్తుంది. ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. దీనివల్ల అద్భుతమైన పనులు చేయగలుగుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి