)
Rahu Transit Effect On 3 Zodiac Signs: రాహువు గ్రహాన్ని నీడ గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా దీనిని కీడు గ్రహంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి గ్రహం సంచారం చేస్తే అన్ని రాశుల వారిపై కీడు ప్రభావం పడుతుందని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటాయి. నిజానికి ఏ గ్రహం సంచారం చేసిన రెండు రకాల ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ గ్రహం జాతకంలో ఉండే స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. జాతకంలో శుభ స్థానంలో ఉంటే రాహువు దేనికి లోటు ఉండదు. అదే అశుభ స్థానంలో ఉంటే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. నవంబర్ 23న రాహు గ్రహం శతభిష నక్షత్రంలోకి సత్యానం చేస్తుంది. జులై 6న పూర్వభాద్ర పాద నక్షత్రంలోకి సంచారం చేయగా.. మళ్లీ నవంబర్ 23న సంచారం చేయబోతోంది. దీంతో ఈ సమయం నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్కులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో చాలా మేలు కూడా జరుగుతుంది. అయితే, శక్తివంతమైన రాహువు ప్రభావంతో ఏయే రాశుల వారికి మేలు జరగబోతుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రాహువు ప్రభావంతో లాభాలు పొందే రాశులు:
మిథున రాశి
శతభిష నక్షత్రంలోకి రాహువు వెళ్లడం వల్ల మిథున రాశి వారికి శుభసంకేతాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా వీరికి వాయిదా పడుతున్న పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. అలాగే కొన్ని రకాల పనులు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. కెరీర్ పరంగా ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. పెట్టుబడులు పెట్టడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా వీరికి ఈ సమయం సామాజిక సంబంధాలను కూడా పెంచుతుంది. అలాగే ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. భాగస్వామితో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. వీరు ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహువు సంచారం ఎన్నో లాభాలనందించబోతుంది. ముఖ్యంగా వీరికి కృషికి తగ్గ గుర్తింపు లభించుతుంది. అంతేకాకుండా జీవితంలో సాధ్యమైనన్ని పనులు ఈ సమయంలోనే చేయగలుగుతారు. విదేశీ వనరుల నుంచి ఊహించని ప్రయోజనాలు కూడా పొందగలిగే అవకాశాలున్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి రాబోతున్నాయి. అలాగే వీరికి సామాజికంగా మంచి ఇమేజ్ కూడా లభిస్తుంది. తల్లిదండ్రుల నుంచి పూర్తి సపోర్టు లభించి కొన్ని రకాల పనులు సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా విద్యను అభ్యసిస్తున్న వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన లాభాలు పొందగలిగే అవకాశాలున్నాయి. ఈ సమయంలో వీరికి మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడుతుంది..
కుంభరాశి
శతభిష నక్షత్రంలో రాహువు ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి కూడా ఈ సమయంలో ఆర్థిక లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా వీరికి కుటుంబంలో కొత్త సభ్యులు చేరే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు చేసే వారికి ఆకస్మిక ప్రమోషన్లు కూడా లభించబోతున్నాయి. అలాగే జీతాలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి. గర్వం లేకుండా ఈ సమయంలో కుంభరాశి వారు పనులు చేయగలుగుతారు. అలాగే పిల్లలనుంచి కూడా ఎన్నో రకాల శుభవార్తలు అందుకుంటారు. మానసికంగా కూడా వీరికి ఎంతో మేలు జరుగుతుంది. వీరి ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. తెలివితేటలు నిర్ణయాలు తీసుకోవడంలో కుంభరాశి వారు ఈ సమయంలో ముందుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook