Rahu Transit 2025 Effect On Zodiac: గ్రహాలు, నక్షత్రాలు మనుషుల జీవితంలో ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తుల జాతకాల్లో గ్రహాలు శుభస్థానంలో ఉంటే బోలెడు లాభాలు కలుగుతాయి. అదే ఈ గ్రహాలు అశుభస్థానంలో ఉంటే అనేక సమస్యలు వస్తూ ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే గ్రహాలు శరీరాలపై ప్రభావం చూపి అనారోగ్య సమస్యలకు కూడా గురి చేస్తాయి. ఇదిలా ఉంటే కొన్ని గ్రహాల ప్రభావం ఎల్లప్పుడు అశుభ ప్రభావాలను చూపుతూ ఉంటాయి. ఇలాంటి ప్రభావం చూపే గ్రహాల్లో రాహు గ్రహం ఒకటి.. శని గ్రహం తర్వాత అత్యంత నెమ్మదిగా సంచారం చేసే గ్రహాల్లో రాహువు ఒకటి. ఈ గ్రహం సంచారం చేసినప్పుడల్లా అన్ని రాశులు ప్రభావితమవుతాయి. ఈ గ్రహం సంచారం చేయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం సమయం పడుతుంది. ఇదిలా ఉంటే అతి త్వరలోనే ఈ గ్రహం సంచారం చేయబోతోంది. మీన రాశిలో ఉన్న ఈ గ్రహం మే 18న సాయంత్రం 5:08 గంటలకు కుంభరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అశుభకరమైన రోజులు ప్రారంభమవుతాయి. అలాగే కొన్ని రాశులవారికి చాలా మేలు జరుగుతుంది.
ఈ రాశులవారికి బోలెడు లాభాలు:
వృషభ రాశి
రాహు సంచారం ఎఫెక్ట్ వల్ల వృషభ రాశి వారి జీవితాల్లో బోలెడు మార్పులు వస్తాయి. వీరికి ఆర్థిక పరమైన విషయాల పట్ల అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా మిగిలిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే కొత్త ఉద్యోగాల్లో కూడా చేరుతారు.
మేష రాశి
రాహువు సంచారం ప్రభావంతో మేష రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో ఊహించని ఆనందం పొందుతారు. అలాగే అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి రాహు సంచారం అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. దీని కారణంగా వీరు అన్ని పనులు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. అలాగే వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఎంత కష్టపడితే, అంత మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది.
సింహ రాశి
సింహ రాశివారికి కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ శుభప్రదమైన సమయంలో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆరోగ్యం పరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టేవారికి వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపారాలు కూడా చాలా శుభప్రదంగా మారుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి రాహువు ఎఫెక్ట్‌తో అనుకున్న పనులన్నీ వెంటవెంటనే జరిగిపోతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది. అలాగే వీరు అన్ని వైపుల నుంచి శుభవార్తలు వింటారు. దీంతో పాటు ఏదైనా కొత్త ప్రణాళికలో ముందుకు వెళ్తూ విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి విశేషమైన లాభాలు కలుగుతాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









