
Shani Dev Effect On Zodiac Telugu: శని దేవుడిని న్యాయదేవుడిగా, కర్మలకు ఫలితాలు అందించే ఫలప్రదాతగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనుషులు జీవితంలో చేసే కర్మలను అనుగుణంగా ఫలాలను అందిస్తూ ఉంటాడు. మంచి చేసే వారికి మంచినే అందిస్తాడు. అలాగే చెడు చేసేవారికి దుష్ప్రభావాలు అందిస్తాడు. ఇదిలా ఉంటే శని గ్రహానికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. జాతకంలో శని గ్రహం శుభస్థానంలో ఉంటే దేనికి లోటు ఉండదు. ముఖ్యంగా అనుకున్న పనులన్నీ వెంట వెంటనే జరిగిపోతాయి. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. శని గ్రహం సంచారం చేసినప్పుడు జాతకంలో ఉండే స్థానాలను బట్టి ఏలినాటి శని ప్రారంభమవుతుంది.
ఇది ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని తో బాధపడుతున్న వారు ప్రతి శనివారం తప్పకుండా శనిదేవుని పూజించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తప్పనిసరిగా జీవితంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు ఎల్లప్పుడూ శని దేవుడి అనుగ్రహం పొందుతారు. ఈ గ్రహానికి మంచి సంబంధం ఉన్న రాశులకి శని గ్రహానికి చాలా ఇష్టం. దీనివల్ల వీరు ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బోలెడు లాభాలు పొందుతారు.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఎల్లప్పుడూ శని అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. వీరు శత్రువులతో కూడా మంచి స్నేహపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. దీని కారణంగా వీరు వారిపై అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా వీరికి శని చెడు ప్రభావం నుంచి ఎల్లప్పుడూ విముక్తి కలుగుతుంది. అలాగే ఎలాంటి ప్రయత్నాలు చేసిన విశేషమైన లాభాలు పొందుతారు. అలాగే వృషభ రాశి వారు శని ప్రభావంతో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడే అవకాశాలు ఉన్నాయి.
తులారాశి
తులా రాశి వారికి శని అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. శని గ్రహం అత్యంత ఇష్టపడే రాశుల్లో తులా రాశి ఒకటి. ఈ రాశి వారికి ఎల్లప్పుడూ ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం చాలావరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ప్రజల సమస్యలపై పోరాడిన తులా రాశి వారు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. తక్కువ సమయంలో కూడా వీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా వీరు ఎలాంటి పనులైన ఎంతో చక్కగా సులభంగా చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
మకర రాశి
శని గ్రహానికి అత్యంత ఇష్టమైన రాశుల్లో మకర రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి శని అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తుంది. దీనివల్ల మీరు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా కార్యాలయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి ఎల్లప్పుడూ మంచి గుర్తింపు లభిస్తూనే ఉంటుంది. తీవ్ర సమస్యల నుంచి కూడా శని దేవుడు వీరిని రక్షించగలుగుతాడు. ముఖ్యంగా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి..
కుంభరాశి
కుంభ రాశి వారికి కూడా శని దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తూ ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ జీవితంలో ఊహించని విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా వీరు మంచి మంచి పనులు చేయగలుగుతారు. అలాగే వీరు జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలు పొందగలుగుతారు. ఉద్యోగాలపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కొన్ని పనుల్లో ఉన్నటువంటి ఆర్థికంగా బోలెడు లాభాలు పొందగలుగుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి