)
Shukra Aditya Raja Yogam Effect On Zodiac: సూర్యుడు అధిపతిగా వ్యవహరించే సింహరాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. ఇది సెప్టెంబర్ 15వ తేదీన జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య శుక్ర గ్రహాలకు మంచి సంబంధం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు శక్తివంతమైనవిగా భావిస్తారు. సూర్యుడి రాశిలోకి శుక్రుడు రావడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల అన్ని రాశుల వారిపై రెండు గ్రహాల ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి భౌతిక సౌకర్యాలతో పాటు సృజనాత్మకత, గౌరవం మొదలైనవి విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా శుక్రాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ఎప్పటినుంచో సంపాదించాలనుకునే డబ్బులు కూడా సంపాదిస్తారు. అయితే, సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశిల వారికి బంపర్ జాక్‌పాట్..
ధనుస్సు రాశి
శుక్రుడు సూర్యుడు అధిపతిగా వ్యవహరించే సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ధనస్సు రాశి వారికి చాలా సానుకూలమైన ప్రయోజనాలు రావడం ప్రారంభమవుతాయి.. ముఖ్యంగా వీరి సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కెరీర్ పరంగా పురోగతి కూడా లభించే అవకాశాలున్నాయి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. ముఖ్యంగా ప్రయాణాలు చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. మానసిక ఒత్తిడి కూడా పూర్తిగా తొలగిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మేషరాశి
మేష రాశి వారికి శుక్రుడి ప్రభావం వల్ల వారి ప్రేమ జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. ఎప్పటినుంచో భాగస్వామ్య జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సమయంలో భాగస్వామితో మంచి సంబంధం ఏర్పడుతుంది. ఒకరినొకరు ఎంతో అర్థం చేసుకొని మంచి శృంగారమైన జీవితాన్ని గడుపుతాయి. అలాగే కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. దీనికి తోడు జీతాలు కూడా భారీ మొత్తంలో పెరిగే అవకాశాలున్నాయి. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా సంబంధాల పరంగా కూడా ఎంతో మేలు జరుగుతోంది.
మిథున రాశి
మిథున రాశి వారికి శుక్రాతిత్య రాజయోగం ఏర్పడడం వల్ల కెరీర్ పరంగా అనేక మార్పులు వస్తాయి. వీరు భారీ మొత్తంలో డబ్బు కూడా సంపాదిస్తారు. అంతేకాకుండా జీవితంలో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సంబంధాల ప్రాముఖ్యత ఈ సమయంలో అర్థమవుతుంది. తోబుట్టులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ కాలంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా కెరీర్ పరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ రాశి వారు భిన్నమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు.. కాబట్టి జీవితంలో చాలా బాగా ముందుకు వెళ్తారు..
సింహరాశి
సింహరాశి వారికి శుక్రుడు సంచారం కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శుక్రాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. సంబంధాలు కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్సులు ఉన్నాయి. దీంతోపాటు వైవాహిక జీవితంలో కూడా ఎన్నో రకాల మార్పులు వస్తాయి. ముఖ్యంగా భాగస్వామితో ఎంతో క్లోజ్‌గా ఉండి.. మానసికంగా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే సమాజంలో మంచి కీర్తి, ప్రతిష్టలు కూడా పొందుతారు. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి