)
Mercury Transits 2025 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని అతి చిన్న గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ గ్రహం అత్యంత స్పీడుగా కదులుతుందని సమాచారం. ఇది ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేయడానికి దాదాపు 30 నుంచి 31 రోజుల వరకు సమయం పడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో 20 రోజుల్లో కూడా సంచారం చేస్తుంది. ఇదిలా ఉంటే ఇంతటి ప్రత్యేకత కలిగిన భూతగ్రహం సెప్టెంబర్ 15వ తేదీన సొంత రాశి అయిన కన్యా రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో కీలకమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆయా రాశలవారు ఆర్థికంగా భారీ మొత్తంలో లాభాలు సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన చాలా వరకు కలిసి వస్తుంది.
ఈ రాశుల వారికి బోలెడు లాభాలు..
కన్యా రాశి
కన్యా రాశి వారికి బుధుడి సంచారం వల్ల చాలా శుభ్రంగా ఉండబోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. బుధుడు కన్యా రాశి వారి జాతకంలో మొదటి స్థానంలోకి రాబోతున్నాడు. కాబట్టి కెరీర్ పరంగా చాలా ప్రయోజనాలు పలుగుతాయి. అంతేకాకుండా ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలిగే ఛాన్స్ ఉంది. ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం విశేషమైన ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు వీరు భారీ మొత్తంలో విస్తరించి అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారికి వ్యాపారాల పరంగా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా భారీ మొత్తంలో కలిసి వస్తుంది.. ఇక వైవాహిక జీవితం గడుపుతున్న వ్యక్తులకు కూడా చాలావరకు ఈ సమయం మాధుర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న వ్యక్తులకు వివాహ ప్రతి వాదనలు కూడా రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మకర రాశి
బుధుడి సంచారం ప్రభావం మకర రాశి వారికి చాలా సానుకూలంగా ఉంటుంది. వీరికి బుధుడు అదృష్టాన్ని కలిగించి విశేషమైన ప్రయోజనాలను అందిస్తాడు. మకర రాశి వారికి బుధుడు జాతకంలో ఆరవ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా వీరి అదృష్టం ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరుగుతుంది. ఇక ఈ సమయంలో వీరు తప్పకుండా ఏదో ఒక చోటికి ప్రయాణాలు చేసే ఛాన్స్ కూడా ఉంది. దీనివల్ల ఆధ్యాత్మికత పై కాస్త ఆసక్తి కూడా పెరుగుతుంది.
ఇప్పటి నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు ఈ సమయం కొంత లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. అలాగే కొన్ని పనుల్లో ఈ సమయంలో తప్పకుండా విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా ప్రణాళికలు రచించడంలో వీరు ముందుండి అద్భుతమైన జీవితం లీడ్ చేయగలుగుతారు. ఈ సమయంలో అదృష్టం కలిసి రావడం వల్ల ఎలాంటి పనులైనా చేయగలుగుతారు.
మిథున రాశి
బుధుడి సంచార ప్రభావం వల్ల మిధున రాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బుధుడు మిథున రాశి వారికి నాలుగవ స్థానంలోకి రాబోతున్నాడు. దీనివల్ల వీరికి భౌతిక ఆనందం విపరీతంగా పెరుగుతుంది. వీరు కొత్త కార్లు లేదా ఇండ్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో అద్భుతమైన శుభవార్తలు వింటారు. ముఖ్యంగా బుధుడు శుభ ప్రభావం వల్ల తప్పకుండా వీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలపరంగా చాలావరకు ఈ రాశికి వారికి కలిసి వస్తుంది.
సాంకేతిక, బ్యాంకింగ్, విద్య, సంగీతం సంబంధిత రంగాల్లో పనులు చేసే వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కొన్ని నాయకత్వ లక్షణాలను కూడా సొంతం చేసుకోగలుగుతారు. దీనివల్ల ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా పొందగలుగుతారు. ఎప్పటినుంచో కొన్ని సమస్యలతో బాధపడుతున్న వారికి తప్పకుండా ఈ సమయంలో పరిష్కారం లభించబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అనుకున్న పనులు తొందర తొందరగా చేయడంలో వీరు ఈ సమయంలో కీలక పాత్ర పోషిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి