Trigrahi Rajyog: త్రిగ్రహి రాజయోగం పవర్‌ఫుల్ ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి నవంబర్ 15 నుంచి బంపర్ బెనిఫిట్స్.. డబ్బే, డబ్బు!

Trigrahi Rajyog Powerful Effect On Zodiac: నవంబర్ 15వ తేదీ చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఇదే రోజు ఏకాదశి వచ్చింది. ఆ తర్వాతి రోజునే ఎంతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు అందిస్తుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 13, 2025, 12:21 PM IST
Trigrahi Rajyog: త్రిగ్రహి రాజయోగం పవర్‌ఫుల్ ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి నవంబర్ 15 నుంచి బంపర్ బెనిఫిట్స్.. డబ్బే, డబ్బు!

Trigrahi Rajyog Powerful Effect On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది నవంబర్ 15వ తేదీ చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఏకాదశి వచ్చింది. అలాగే హిందువులంతా ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే ఈరోజు కొంతమంది ఏకాదశి ఉపవాసాలను కూడా పాటిస్తారు. ఆ మరుసటిరోజే గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడి వృశ్చికంలో ఇప్పటికే బుధుడు ఉన్నాడు. అయితే సూర్యుడు కూడా ప్రవేశించడం వల్ల ఈ సమయంలో త్రిగ్రహ యోగం రాజయోగం ఏర్పడుతుంది. 

Add Zee News as a Preferred Source

త్రిగ్రహ రాజయోగాన్ని ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈరోజు రాజయోగం ఏర్పడడం వల్ల వీరికి కోరుకున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా అదృష్టం కూడా కలిసి రాబోతోంది. ముఖ్యంగా కుజుడు, బుధుడు, సూర్యుడు మూడు గ్రహాల ప్రభావంతో రాశుల వారికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. అంతేకాకుండా కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మకర రాశి 

మకర రాశి వారికి త్రిగ్రహ రాజయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆదాయం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అవసరమైన ఖర్చులు కూడా పూర్తిగా తగ్గే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా చాలావరకు బలపడతాయి. ఊహించని వనరుల నుంచి డబ్బులు పొందగలుగుతారు. అసంపూర్ణంగా ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. అలాగే వీరికి ఈ సమయంలో పెద్ద పెద్ద పనుల్లో విజయం లభిస్తుంది. 

వృశ్చిక రాశి 
నవంబర్ 16వ తేదీ నుంచి వృశ్చిక రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మొదటి స్థానంలోకి సూర్యుడికి ప్రవేశించడం వల్ల వీరికి ఈ సమయంలో నైపుణ్యం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే ఉన్నట్టుండి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. వీరు ఎంతో ఉత్సాహంగా జీవితాన్ని ముందుకు సాగిస్తారు. ఇక ఈ సమయంలో ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందగలుగుతారు. ఆదాయం కూడా పెరిగి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. కెరీర్, వ్యాపారాల పరంగా ఈ సమయం ఊహించని లాభాలను తెచ్చిపెట్టబోతోంది. 

మిథున రాశి
మూడు గ్రహాల ప్రభావంతో మిధున రాశి వారికి సంపాదనతో పాటు శ్రేయస్సు విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో ఆర్థిక స్థిరత్వం కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇక ఇతరుల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించ గలుగుతారు. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో మంచి కంపెనీల నుంచి జాబ్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. అలాగే పెట్టుబడుల గురించి కూడా ఊహించని ఆదాయాన్ని పొందుతారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అప్పు తీసుకున్న వారి నుంచి ఈ సమయంలో ప్రశంసలు కూడా పొందుతారు.

Also Read: Shani Dev Effects: నవంబర్‌లో శని ప్రత్యక్ష కదలికలు.. ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్.. ఊహించని ఆదాయం!

కుంభరాశి 
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా సూర్యుడి ప్రత్యేకమైన ప్రభావంతో విశేషమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. జీతం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆదాయ వనరులు కూడా పెరిగి అద్భుతమైన లాభాలు పొందుతారు. ఎప్పటినుంచో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు పరిష్కారం కూడా లభించబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

(నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఈ సమాచారాన్ని జీ న్యూస్ దృవీకరించదు.)

Also Read: Shani Dev Effects: నవంబర్‌లో శని ప్రత్యక్ష కదలికలు.. ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్.. ఊహించని ఆదాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News