Venus Effect On Zodiac: అత్యంత వేగంగా కదిలే గ్రహాల్లో శుక్రుడు ఒకటి. ఈ గ్రహం ప్రత్యేకమైన సమయాల్లో ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశాన్ని జ్యోతిష్య శాస్త్రంలో సంచారంగా పిలుస్తారు. అప్పుడప్పుడు ఈ గ్రహం నక్షత్ర సంచారంతో పాటు తిరోగమనం కూడా చేస్తుంది. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో విలాసవంతం సంపద ఆనందం ఆకర్షణకు సూచికగా భావిస్తారు. అందుకే జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉన్న వ్యక్తులకు డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు అంతేకాకుండా జీవితంలో ఆనందంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ప్రేమ జీవితం చాలా అద్భుతంగా ముందుకు కొనసాగుతుంది. శుక్రుడు జాతకంలో అశుభ స్థానంలో ఉంటే జీవితం ఎప్పుడు పేదరికంలోనే కొనసాగుతుంది. అంతేకాకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు లేకుండా ఉంటాయి. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరవు. ఇలాంటి ఎంతో ప్రత్యేకత కలిగిన శుక్ర గ్రహం డిసెంబర్ 11న అస్తమించబోతున్నాడు.
శుక్రుడు అస్తమించడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కీడుకాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో వివాహాలతో పాటు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరగవు. అయితే డిసెంబర్ 11 నుంచి శుక్రుడు అస్తమించి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఇలాగే ఉంటాడు. దీనివల్ల అప్పటివరకు వివాహాలతో పాటు ఇతర శుభకార్యాలు జరుపుకోవడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వారు అంటున్నారు. ముఖ్యంగా కొన్ని రాశుల్లో జన్మించిన వ్యక్తులు ఈ సమయాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని వారు అంటున్నారు.
ఈ రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశాలు..
మేష రాశి
శుక్రుడు అస్తమించడం వల్ల మేష రాశి వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వీరికి పనులన్నీ నిలిచిపోతాయి. అలాగే వివాహాలు ఆలస్యంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి.. కాబట్టి ఎంతో జాగ్రత్తగా జీవితాన్ని ముందుకు సాగించడం మంచిది. ఈ సమయంలో ఊహించని ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి.
వృషభ రాశి
శుక్రుడి ఎఫెక్ట్‌తో వృషభ రాశి వారికి కూడా జనవరి 11వ తేదీ నుంచి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు కొన్ని పనుల్లో పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పనుల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగడం మంచిది ఆర్థికంగా కూడా ఈ సమయంలో తీవ్రంగా నష్టాలు జరగొచ్చు. పెట్టుబడులు పెట్టేవారు తప్పకుండా ఆలోచిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా చాలావరకు ఈ సమయంలో నష్టపోతారు..
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
మిధున రాశి
మిధునరాశిలో జన్మించిన వ్యక్తులు కూడా ఈ సమయంలో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్య జీవితంలో ఎన్నో సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబంలో అనేక వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లే వ్యక్తులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వ్యాపారాలు అస్తవ్యస్తంగా జరిగే అవకాశాలున్నాయి. ఎప్పటినుంచో కొన్ని సమస్యలతో బాధపడుతున్న వారు ఈ సమయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సూచనలు సలహాల నుంచి సేకరించింది మాత్రమే.. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు.
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









