Venus Transit Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని ఆనందంతోపాటు సంపద కీర్తి శ్రేయస్సుకు సూచికగా చెప్పుకుంటూ ఉంటారు. జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఆనందంతో పాటు కీర్తి, ప్రతిభ, శ్రేయస్సు, ప్రేమ అన్నీ లభిస్తాయి. అందుకే శుక్ర గ్రహానికి అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం ఎల్లప్పుడూ అన్ని రాశుల వారిపై శుభ ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందంతో పాటు ఐశ్వర్యాన్ని అందిస్తుంది. అయితే, జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉన్న వ్యక్తులకి అనుకోని ఆనందాన్ని కూడా అందిస్తాడు. ఇది ఇలా ఉంటే నవంబర్ 26న శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. డిసెంబర్ 9వ తేదీన బుధుడు పాలించే జ్యేష్ఠ నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి కొన్ని రాశులకి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో నాలుగు రాశులు అద్భుతమైన విజయాలు సాధించగలుగుతాయి. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు.
ఈ రాశులవారికి బంపర్ గుడ్‌న్యూస్:
మీన రాశి
శుక్రుడి అనుగ్రహం వల్ల మీన రాశి వారికి వ్యక్తిగత జీవితం చాలావరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు సామాజికంగా చాలా వరకు కలిసి వస్తుంది. కొత్త వ్యాపారానికి ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు పూర్తిగా పరిష్కారమై ఒత్తిడి కూడా తగ్గుతుందని జ్యోతిష్యుడు చెబుతున్నారు. దీంతోపాటు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఈ సమయంలో ఆసక్తి కూడా పెరుగుతుంది. వీరు మతపరమైన తీర్థయాత్రలకు కూడా వెళ్లగలుగుతారు. దీంతోపాటు ఆనందం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
మిథున రాశి
జేష్ఠ నక్షత్రంలోకి శుక్రుడు సంచారం చేయడం కారణంగా మిధున రాశి వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా సృజనాత్మకత కూడా పెరిగి నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్తారు. అంతేకాకుండా మీ భాగస్వామ్య జీవితం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఊహించని ఆనందాన్ని కూడా పొందగలుగుతారు. కొత్త పెట్టుబడిలో నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు. దీంతోపాటు కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి.. మంచి లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కన్య రాశి
కన్యారాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రేమ జీవితం చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది. అలాగే వీరు ఆనందంతో ముందుకు. ఉద్యోగస్తులకు ఈ సమయం పదోన్నతులను కూడా అందిస్తుంది. ఎప్పటినుంచో అనుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అబ్బడమే కాకుండా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఎప్పుడు పొందలేని ఆనందాన్ని కూడా పొందగలుగుతారు.
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి లో జన్మించిన వ్యక్తులకు జ్యేష్ట నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం కారణంగా నిరంతర సవాళ్ల నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయం అద్భుతమైన ప్రేమనందిస్తుంది. దీంతోపాటు ఖర్చులు కూడా పూర్తిగా తగ్గుతాయి. అలాగే ఆరోగ్యం కూడా ఎంతగానో మెరుగుపడే అవకాశాలున్నాయి. ఎప్పటినుంచో అనుకుంటున్నా సమస్యలు పరిష్కారం కూడా కాబోతున్నాయి. దీంతోపాటు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఈ సమయంలో జీవితంలో కీలకమైన మార్పులు సంభవిస్తాయి.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించింది. ఇది మీ నమ్మకాలపై ఆధాపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు.
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









