)
Jogulamba Temple: హిందూవుల అతి పెద్ద పండుగ దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఏకైక శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను శాస్త్రోక్తంగా ఆలయ అధికారులు, అర్చకులు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో కొలువుదీరిన ఐదో శక్తిపీఠం జోగులాంబ ఆలంపూర్ క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవోపేతంగా ప్రారంభించారు. ఆలయ ఈఓ దీప్తి, పాలకమండలి సభ్యులు అర్చక స్వాములతో కలిసి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. అర్చకులు ఈఓతో కలిసి మంగళవాయిద్యాలు, పట్టువస్త్రాలతో బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారి అనతీ స్వీకరణ పూజలు చేశారు.
అనంతరం స్వామివారి ఉత్సవ బలిభేరీ తీసుకొని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం తరఫున పట్టువస్త్రాలు, మంగళ ద్రవ్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా యాగశాల ప్రదక్షిణ, ప్రవేశం, మహా గణపతిపూజ, పుణ్యాహ వచనం, ఋత్విక్ వరణ, రక్షాబంధనం, మహా కల శస్థాపన, అగ్నిముఖం చేశారు. యాగశాలలో చండీ హోమం, సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నవాన్న సహిత మహానివే దన, బలిహరణ సమర్పణ కార్యక్రమాలు కొన సాగాయి.
మృతసంగ్రహణంలో భాగంగా స్వామి వారి ఉద్యానవనంలో పుట్టమట్టికి పూజలు చేశారు. అనంతరం మహిళలు పుట్టమట్టిని మంగళవాయి ద్యాల మధ్య యాగశాలకు చేర్చారు. కార్యక్రమం లో ఆలయ ధర్మకర్తలు నాగశిరోమణి, సరస్వతి, జగదీశ్వర్ గౌడ్, గోపాల్, జగన్మోహన్ నాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాథ్డ్డి, అడ్డాకుల వెంకటే శ్వర్లు, పులేందర్, సురేందర్ స్వామి, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు, ఎక్అఫిషియో సభ్యులు ఆనంద్ శర్మ, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దేవీశరన్న నవరాత్రిని పురస్కరించుకొని ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు ప్రతీకగా ధ్వజా రోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా అమ్మవారి ఆలయంలో ధ్వజారోహణం చేశారు. శక్తిని ప్రేరేపించేందుకు దేవతలకు ఆవాహనం పలు కుతూ ఉత్సవానికి గుర్తుగా ధ్వజాన్ని ఆరోహణ చేస్తారని అర్చక స్వాములు తెలిపారు. ఎమ్మెల్యే విజయుడు హాజరై అర్చకస్వాములతో కలిసి ధ్వజారోహణం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook