Edupayala Vana Durga Bhavani: మహా శివరాత్రి వేడుకలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని పలు శైవ క్షేత్రాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గా దేవి ఆలయంలో మహా శివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. మహా శివరాత్రి సందర్భంగా ఏడుపాయల భక్తులతో కిక్కిరిసింది. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంలో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
Also Read: Maha Shivaratri: మహా శివరాత్రి వేళ శివుడి టాప్ 10 రహాస్యాలు తెలుసుకుందాం..
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో మహా శివరాత్రి వేడుకలు కనుల పండుగ జరుగుతున్నాయి. జాతర సందర్బంగా వన దుర్గా భవానీ మాతకు మంత్రి దామోదర రాజనర్సింహ పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సును ఆయన ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో శివరాత్రి జాగారాలు, పూజలు జరగనున్నాయి. ఈ జాతరకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు.
Also Read: Maha Shivaratri 2025: ఏ పేరుతో పిలిచినా పలికే ప్రతక్ష్య దైవం శివుడు.. ఈ పేర్లతో పిలవవచ్చు
భక్తులు మెచ్చే కోరిన కోరికలు తీర్చే దేవతగా పిలిచే వనదుర్గ అమ్మవారి జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నాయి. భక్తులు ఆలయంలో జాగారాలు చేసేందుకు ప్రత్యేకంగా చలువ పందిళ్లు ఏర్పాటుచేశారు. జాతర సందర్భంగా భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, బస్సులు, విద్యుత్ దీపాలతో అలంకరణ, భక్తులకు త్వరగా దర్శన ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా వనదుర్గా భవాని మాత ప్రధాన ఆలయాన్ని, మండపాన్ని, ధ్వజస్తంభాన్ని రంగురంగుల పువ్వులతో శోభాయమానంగా అలంకరించారు. మంజీరా నది పాయలలో ప్రత్యేకంగా శివుడు, లింగం, గోవుల భారీ సెట్టింగ్ ఏర్పాటుచేశారు.
జాతరలో ముఖ్య ఘట్టాలు
ఏడుపాయల మహా జాతర ప్రధానంగా మూడు రోజులు జరుగుతుంది.
- తొలిరోజు మహాశివరాత్రి
- రెండో రోజు బండ్ల బోనాలు ఊరేగింపు
- మూడో రోజు రథోత్సవం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









