Eid Ul Fitr 2025: ఈదుల్ ఫిత్ర్ విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి, ఫిత్ర్ అర్ధమేంటి

Eid Ul Fitr 2025: నెల రోజుల రంజాన్ ఉపవాస దీక్షలు ముగుస్తున్నాయి. మరో రెండు రోజుల్లో రంజాన్ పండుగ ఉంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ పండుగ. అసలు ఈదుల్ ఫిత్ర్ అంటే ఏమిటి, విశిష్టత ఏంటి ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 29, 2025, 03:56 PM IST
Eid Ul Fitr 2025: ఈదుల్ ఫిత్ర్ విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి, ఫిత్ర్ అర్ధమేంటి

Eid Ul Fitr 2025: దాదాపు నెల రోజులుగా ముస్లింలు ఆచరిస్తున్న రంజాన్ కఠిన ఉపవాస దీక్షలు ముగియనున్నాయి. మరో రెండు రోజుల్లో ఈదుల్ ఫిత్ర్ పండుగ ఉంది. మార్చ్ 31 లేదా ఏప్రిల్ 1న ఉన్న ఈ పండుగ జరుపుకోనున్నారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ విశిష్టత ఏంటి, ఫిత్ర్ అంటే ఏమిటనేది పరిశీలిద్దాం.

Add Zee News as a Preferred Source

ఇస్లామిక్ కేలండర్ ప్రకారం రంజాన్ అనేది నెల పేరు. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఈ నెలలో అవతరించింది. అందుకే ఈ నెలంతా అత్యంత నిష్ఠతో ఉపవాసాలు ఉంటాయి. ఇస్లామిక్ కేలండర్ ప్రకారం 29 లేదా 30 రోజులు ఉంటాయి. అందుకే 29 రోజులు ఉపవాసాలు పూర్త్యయ్యాక చంద్ర దర్శనమైతే 30వ రోజూ పండుగ జరుపుకుంటారు. లేకపోతే 30 రోజులు ఉపవాసాలు పూర్తి చేసి చంద్రదర్శనంతో సంబంధం లేకుండా 31వ రోజు పండుగ ఉంటుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్. 

ఈదుల్ ఫిత్ర్ అంటే ఏమిటి

రంజాన్ నెలలో ఉపవాసాల తరువాత జరుపుకునే పండుగ ఈదుల్ ఫిత్ర్. ఫిత్ర్ అంటే ప్రత్యేకమైన దానం. అంటే పండుగను పేదలు కూడా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో చేసినవి. మీ ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులుంటే అంతమంది పేరుతో బియ్యం లేదా గోధుమలు మీరు ఏం తింటారో అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి 2.60 కిలోల చొప్పున మనం తినేది లెక్కగట్టి ఇవ్వాలి. అంటే మీ ఇంట్లో ఒకవేళ మగ్గురు కుటుంబ సభ్యులుంటే ముగ్గురికి కలిపి 7.8 కిలోలు మీరు ఏ రకం బియ్యం లేదా గోధుమలు తింటున్నారో అవి పేదలకు ఇవ్వాలి. ఇది పండుగ కంటే ముందు ఇవ్వాలి. దీనినే ఫిత్రా అంటారు. అందుకే ఈదుల్ ఫిత్ర్ పండుగగా పిలుస్తారు. 

ఈదుల్ ఫిత్ర్ పండుగ రోజున ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్ధనలు జరుపుకుంటారు. ఆ తరువాత కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో విందు ఆరగించి ఆనందంగా గడుపుతారు. 

Also read: AP 10th Exams 2025: పదో తరగతి పరీక్ష తేదీలో మార్పు, ఫలితాలు ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News