)
Friday Maha Lakshmi Puja: ప్రపంచమంతా ఇప్పుడు డబ్బుతోనే నడుస్తోంది. డబ్బే ప్రపంచాన్ని నడుపుతోంది. పేదవాడి నుంచి అత్యంత సంపన్నుడి వరకు డబ్బులేనిదే జీవం లేదు అన్నట్లు జీవనం సాగుతోంది. కొందరికి అదృష్టం వరించి ధనవంతులు అవుతుంటే.. కొందరు పేద నుంచి ఇంకా నిరుపేద స్థాయికి వెళ్తున్నారు. అయితే మన హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే డబ్బుకు కొదవ ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆమె అనుగ్రహం లేకుండా ఎంత కష్టపడ్డా.. ఫలితం ఉండని హిందువుల నమ్మకం. అయితే ప్రతి శుక్రవారం లేదా ప్రతిరోజూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, పూలు, ఫలాలతో పూజిస్తే ఆమె కటాక్షం లభిస్తుందని భక్తులు అంటున్నారు. లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.
వీటితో పూజిస్తే లక్ష్మీ కటాక్షం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రవారం నాడు కొన్నింటిని ప్రత్యేకంగా పూజిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అంటున్నారు. ఈ పండు, పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె అనుగ్రహిస్తుందని నమ్మకం.
శ్రీఫలం (చిన్న కొబ్బరికాయ)
శ్రీఫలం అంటే లఘు నారికేళం.. అనగా చిన్న కొబ్బరికాయ. చిన్నగా ఉండే కొబ్బరికాయలను అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. దీన్ని పూజగదిలో ఉంచుకొని.. ప్రతి శుక్రవారం పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందట. అంతేకాకుండా శ్రీఫలంతో పూజ చేయడం వల్ల ఏలినాటి శని వదులుతుందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. వ్యాపారస్తులు డబ్బు పెట్టే పెట్టెలో ఈ శ్రీఫలం ఉంచడం వల్ల అంతా మంచే జరుగుతుందట.
శ్రీ సూక్తం
శ్రీ మహాలక్ష్మీ దేవి పూజలో పఠించే స్తోత్రమే ఈ శ్రీసూక్తం. దీన్ని రుగ్వేదంలో వివరించారు. మహాలక్ష్మీ అమ్మావారిని స్తుతిస్తూ చేసే ఈ వేద మంత్రాల పఠనం వల్ల ఆమె ప్రసన్నం అవుతుందని పెద్దలు చెబుతున్నారు. కానీ,ఈ శ్రీసూక్తాన్ని సరిగ్గా ఉచ్చరించకపోతే వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అందుకే ఈ శ్రీసుక్తాన్ని పండితుల సమక్షంలో పఠనం చేయడం మంచిది. ఈ మంత్రం నిత్యం ప్రతిధ్వనించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందట.
శ్రీ చక్రం
అమ్మవారి శ్రీచక్రానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ మహాలక్ష్మికి చెందిన శ్రీచక్రాన్ని పూజా గదిలో ఉంచడం వల్ల పూజగదిలో ఉంచితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రసిద్ధి.
తామరపూలు
క్షీరసాగర మధనంలో తామరపువ్వు నుంచి శ్రీమహాలక్ష్మి ఉద్భవిస్తుందని అందరికి తెలుసు. అందుకే ఆమెను తామర పువ్వులతో పూజిస్తే మంచి జరుగుతుంది. వీటితో పాటు శంఖం, గవ్వలు వంటి వాటితో పూజించడం వల్ల ఆమె ప్రసన్నురాలు అవుతుందట. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని తామరపూలతో పూజిస్తే సిరిసంపదలు కలుగుతాయట.
నేతి దీపాలు
దీపాన్ని చీకటిని, అజ్ఞానాన్ని, దారిద్య్రాన్ని పారదోలేందుకు చిహ్నంగా పరిగణిస్తారు. అలాంటి దీపాన్ని ఆవునెయ్యితో దీపం పెట్టడం అమ్మావారికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. ప్రతి శుక్రవారం పూజాగదిలో ఆవునేతితో చేసిన దీపాన్ని వెలిగిస్తే.. ఆ ఇంట పాడిపండలు, ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాని హిందువుల విశ్వాసం. పైన చెప్పిన వాటన్నిటితో శ్రీ మహాలక్ష్మి దేవిని పూజిస్తే ఇంట ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది.
గమనిక: పైన పేర్కొన్న సమాచారమంతా జోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పొందుపరిచినది. దీన్ని పాటించే ముందు సంబంధిత జోతిష్య నిపుణున్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరిచడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook