Gajakesari Raja Yoga Effect On Zodiac: బృహస్పతి గ్రహాన్ని దేవగురువుగా పిలుస్తారు. ఈ గ్రహం దేవతకు గరువుగా వ్యవహరిస్తుంది. బృహస్పతి గ్రహం రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం, తిరోగమనం చేస్తే దాదాపు అన్ని రాశులు ప్రభావితమవుతాయి. ఈ సమయంలో కొన్ని రాశులవారికి జీవితంలో ఊహించని లాభాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి సమస్యలు దుష్ప్రభావాలు వస్తాయి. అయితే ఏవైన రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే, ప్రత్యేకమైన మహా రాజయోగాలు కూడా ఏర్పడతాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 2న చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ బృహస్పతి గ్రహం ఇప్పటికే ఆ రాశిలో సంచార దశలో ఉంది. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది. దీని వల్ల 'గజకేసరి రాజయోగం' ఏర్పుడుతుందని జ్యోతిష్యులు(Astrology) తెలుపుతున్నారు. అలాగే ఆర్థిక పరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
కర్కాటక రాశి
గజకేసరి రాజయోగం (Gajakesari Raja Yoga) ఏర్పడం వల్ల కర్కాటక రాశి (Karkata Rasi) వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో జీవితంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దీంతో పాటు ఆదాయం కూడా భారీ మొత్తంలో పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు సమాజంలో వీరికి గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే అనుకున్న పనులు కూడా చేస్తూ ముందుకు వెళ్తారు. దీంతో పాటు కొంతమంది కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎలాంటి పనులు చేసిన ఊహించని లాభాలు పొందుతారు.
వృషభ రాశి
వృషభ రాశి (Simha Rasi)వారికి సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. వీరికి జీవితంలో సానుకూల ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఈ శక్తివంతమైన రాజయోలు ఏర్పడడం వల్ల కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా భవిష్యత్‌కు సంబంధించిన సంపదనలో కూడా మార్పులు వస్తాయి. ఇక వైవాహిక జీవితం (marriage life) పరంగా ఈ సమయం ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో కొంత కష్టపడడం వల్ల ప్రమోషన్స్ కూడా కలుగుతాయి. అవివాహితులకు వివాహాలు కూడా జరుగుతాయి. కొత్త ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే మానసిక ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
సింహ రాశి
సింహ రాశివారికి ఈ గజకేసరి రాజయోగం (Gajakesari Raja Yoga) ఏర్పడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఉద్యోగాల పరంగా వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా వ్యాపారాల పరంగా కూడా ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాలు లేనివారు కొత్త జాబ్స్ (jobs) కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సింహ రాశివారు కొత్త ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే సింహ రాశివారు ఈ సమయంలో విహారయాత్రలకు కూడా వెళ్లే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









