)
Gajakesari Raja Yoga Effects On Zodiac: అక్టోబర్ చివరివారం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మేష రాశితో పాటు కర్కాటక సహా మరికొన్ని రాశుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోంది. ముఖ్యంగా అక్టోబర్ 30తో పాటు 31 తేదీల్లో బృహస్పతితో పాటు చంద్రుడు ప్రత్యేకమైన సంయోగాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. దీని కారణంగానే గజకేసరి రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోంది. అలాగే అనుకున్న పనుల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించి.. సంపాదన పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గజకేసరి రాజయోగ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దీనివల్ల ఆరు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశుల వారికి బంపర్ డబ్బు..
మకర రాశి
మకర రాశి వారికి ఈ గజకేసరి రాజయోగం ఏర్పడడం కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో అనేక చింతలు తొలగిపోయే అవకాశాలున్నాయి. ఇక వీరికి ఈ సమయంలో అదృష్టం కూడా కలిసి వచ్చి అద్భుతమైన లాభాలు పొందుతారు. భవిష్యత్తులో చేయాలనుకుంటున్న పనులకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. రుణ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కూడా కలుగుతుంది. అలాగే వివిధ మార్గాల నుంచి ఆదాయాన్ని కూడా సంపాదిస్తారు. దీంతోపాటు కొత్త ఇంటిలో పాటు వాహనాల కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటినుంచో తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా పనుల్లో ఘననీయమైన మార్పులు సంభవిస్తాయి. అలాగే అక్టోబర్ చివర్లో మీరు తప్పకుండా కొన్ని శుభవార్తను కూడా వింటారు.
మేషరాశి
మేష రాశి వారికి బృహస్పతి చంద్రుల అద్భుత సంయోగం కారణంగా ఏర్పడే గజకేసరి రాజయోగం వల్ల ఆదాయ సంబంధిత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆదాయ సంబంధిత ప్రయత్నాన్ని కూడా సులభంగా ముందుకు సాగుతాయి. ఇక మేష రాశి వారు కూడా ఈ సమయంలో తప్పకుండా కొత్త ఇళ్లతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేయగలుగుతారు. అంతేకాకుండా అనుకున్న కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. ఇక ఉద్యోగులు ఉన్నతాధికారుల సపోర్టుతో విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా వీరి సంబంధాలు మరింత మెరుగుపడి భవిష్యత్తులో బాగా రాణించగలుగుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా చంద్రుడు ఏడవ స్థానంలో ఉండబోతున్నాడు. అక్టోబర్ చివరి నుంచి ఈ రాశి వారికి శుభ సమయం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా శత్రువుల బాధ నుంచి విముక్తి లభించడమే కాకుండా అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఈ సమయంలో జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా రుణ సంబంధిత సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి. ఆదాయం కూడా గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉంది. వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook