Gajakesari Raja Yoga Effect: గజకేసరి రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు.. డబ్బే, డబ్బు..

Gajakesari Raja Yoga Effects On Zodiac Signs Telugu News: ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి నవంబర్ 11వ తేదీ నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా కలిసి రాబోతోంది. అలాగే అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 11, 2025, 11:24 AM IST
Gajakesari Raja Yoga Effect: గజకేసరి రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు.. డబ్బే, డబ్బు..

Gajakesari Raja Yoga Effects On Zodiac Signs Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని ఎంతో శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. జాతకంలో ఈ గ్రహం శుభ స్థానంలో ఉన్న రాశుల వారికి ఎలాంటి లోటు ఉండదు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా బాగా రాణించగలుగుతారు. దేవ గురువు బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచార దశలో ఉన్నాడు. అలాగే నవంబర్ 10 న చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీని ఫలితంగానే చంద్ర గృహస్పతి గ్రహాల కలయిక జరిగింది. ఈ గ్రహాలకు కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం(Gajakesari Raja Yoga Effects On Zodiac Signs)ఏర్పడింది. అక్టోబర్ 18న బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు.. అయితే, డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా ఇదే గ్రహంలో కొనసాగుతాడు. దీనివల్ల కొన్ని రాశుల వారిపై స్పెషల్ ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా డిసెంబర్ 11వ తేదీ నుంచి ఈ ప్రభావం ప్రారంభమైంది. గజకేసరి రాజయోగ ప్రభావం వల్ల ఈ క్రింది రాశుల వారికి కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా చాలావరకు కలిసి రాబోతోంది.

Add Zee News as a Preferred Source

ఈ రాశుల వారికి బంపర్ లాభాలు..
మేష రాశి 
శక్తివంతమైన గజకేసరి రాజయోగం వల్ల మేషరాశి వారి జీవితాల్లో అదృష్టం ప్రకాశించబోతోంది. ముఖ్యంగా వీరికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. అలాగే కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి కూడా లభిస్తుంది. ఉద్యోగాలు మారాలని చూస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా వరకు మెరుగుదల కనిపించి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

తులారాశి 
కర్కాటక రాశిలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల ఏర్పడే గజకేసరి రాజయోగ ప్రభావం తులారాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి సమాజంలో గౌరవం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వ్యాపార పరిస్థితులు చాలావరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు భాగస్వామ్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లల గురించి కూడా ఈ సమయంలో అద్భుతమైన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితంలో వస్తున్న విభేదాలు కూడా చాలా వరకు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అనుకున్న పనుల్లో కూడా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు.

Also Read: Shani Dev Effects: నవంబర్‌లో శని ప్రత్యక్ష కదలికలు.. ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్.. ఊహించని ఆదాయం!

కన్య రాశి 
చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడిన గజకేసరి రాజు యోగ ప్రభావం కన్యా రాశి వారికి విశేషమైన ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వీరికి ఉద్యోగాలపరంగా చాలా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఇంటర్వ్యూల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోంది. పాత స్నేహితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందగలుగుతారు. అంతేకాకుండా కొన్ని రకాల శుభవార్తలు కూడా ఈ సమయంలో వింటారు. 

నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ వార్తను జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించదు..

Also Read: Shani Dev Effects: నవంబర్‌లో శని ప్రత్యక్ష కదలికలు.. ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్.. ఊహించని ఆదాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News